Just In

మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్

Submitted by arun on Sat, 11/17/2018 - 11:52

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు చేసినా హైకమాండ్ కనికరించలేదు మూడో లిస్టులో మర్రి పేరును ప్రకటించలేదు. మరోవైపు మర్రిశశిధర్ రెడ్డి ఆశించిన సనత్ నగర్ స్థానంలో టీటీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. సనత్ నగర్ నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.

జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం...జగన్‌ను టార్గెట్‌ చేసిన పవన్‌

Submitted by arun on Sat, 11/17/2018 - 11:27

జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జగన్‌ టార్గెట్‌గా పవన్‌ చేసిన కామెంట్స్‌కు వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇంతకీ జనసేనానికి జగన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు?
 
అదిగో పొత్తులు, ఇదిగో మధ్యవర్తిత్వం అంటూ  ఏపీ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ  వైసీపీ , జనసేనల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ టార్గెట్‌గా పవన్ విమర్శలకు పదును పెట్టారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మోస్తున్న  పవన్ అసలు అజెండా చెప్పాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. 

కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఖుష్బూ

Submitted by arun on Sat, 11/17/2018 - 11:19

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సంచలన ఆరోపణలు చేశారు. బతకమ్మచీరల పేరుతో 222 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన  ఖుష్బూ కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతిభవన్‌లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోవట్లేదని అన్నారు. 

అందుకే నాకు అన్యాయం: శంకరమ్మ

Submitted by arun on Sat, 11/17/2018 - 11:13

తాను బీసీని కాబట్టే అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నాయకురాలు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శంకరమ్మ నిన్న ఎల్బీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. తనకు టికెట్ దక్కకపోవడంపై శంకరమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్క సీటు ఇచ్చారని, ఇప్పుడు అది కూడా దక్కలేదని వాపోయారు.  

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Submitted by arun on Sat, 11/17/2018 - 11:03

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.

మహాకూటమికి గ్లామర్ బూస్ట్...ప్రచార పర్వంలోకి టాలీవుడ్ స్టార్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:55

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి సింహా దిగుతున్నాడు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో చావు లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త జోష్ ఇస్తుంది. మహాకూటమిలో కోరిన సీట్లను టీడీపీ దక్కించుకుంది. మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు. 

ప్రచార జోరు పెంచుతున్న గులాబీ దళం

Submitted by arun on Sat, 11/17/2018 - 10:42

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార జోరు పెంచబోతోంది. కేసీఆర్ ప్ర‌చార షెడ్యూల్ ఖరారు కారు జెట్ స్పీడులో దూసుకుపోబోతోంది. ఇంతకాలం మహాకూటని సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ వ‌రుసగా బహిరంగ సబల్లో పాల్గొనబోతున్నారు. బాస్ వస్తే క్షేత్ర స్థాయిలో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. 

పొన్నాలకే జనగామ టికెట్‌

Submitted by arun on Sat, 11/17/2018 - 10:35

సస్పెన్స్ వీడింది. రాజీ కుదిరింది. జనగామ సీటుతో పాటు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంలో కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి మధ్య తలెత్తిన తగవు సమసిసోయింది. కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి నేతలు హైదరాబాద్‌లో అర్థరాత్రి సాగించిన చర్చలు విజయవంతమయ్యాయి. జనగామ సీటును పొన్నాలకే వదిలేయాలని కోదండరాం నిర్ణయించారు. అలాగే 12 స్థానాల్లో కాకుండా 8 చోట్లే టీజేఎస్ పోటీ చేయడానికి అంగీకరించారు. అలాగే అర్థరాత్రి సాగిన చర్చల్లో నాలుగు పార్టీల కూటమికి ఓ రూపు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక కూటమికి ప్రజా కూటమిగా నామకరణం చేశారు. కూటమి కన్వీనర్‌గా కోదండరాంను నియమించారు.

కాసేపట్లో కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని నామినేషన్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:27

అనూహ్యంగా కూకట్‌పల్లి టికెట్ దక్కించుకున్న నందమూరి సుహాసిని నేడు నామినేషన్ వేయనున్నారు. నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం బయల్దేరిన ఆమె కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో  11:21 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె వెంట బాలకృష్ణ, టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పెద్దిరెడ్డి ఇతర నేతలు  ఉన్నారు. 

అక్కకోసం ట్వీట్ చేసిన తమ్ముళ్లు

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 10:10

తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్ పల్లి బరిలో నిలిచిన నందమూరి సుహాసిని.. తన ఇద్దరు తమ్ముళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిన్న తమ్ముడు ఎన్టీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  ఆమె పబ్లిక్ సర్వీసులో తన మొట్టమొదటి దశను తీసుకుంటుంది.  'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు సర్గీయ తారకరామారావుగారు తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసినదే.