Just In

మరో మైలురాయిని చేరుకున్న జగన్ పాదయాత్ర

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 21:27

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. జగన్‌ పాదయాత్ర ప్రారంభించి నేటి(ఆదివారం)తో 300 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర…బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్‌, సీతారంపురం, గురుగుపల్లి క్రాస్‌, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రాజర్వాయర్‌ వరకు కొనసాగింది. ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనసమితి రెండో లిస్టు విడుదల

Submitted by chandram on Sun, 11/18/2018 - 17:50

తెలంగాణ జనసమితి రెండో లిస్టును ప్రకటించింది. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీజేఎస్‌ తాజాగా మరో మూడు స్థానాలకు అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. మిర్యాలగూడ నుంచి విద్యాధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ నుంచి ఇన్నయ్యను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పటికే మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక, మల్కాజ్‌గిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్త ఏడుగురు అభ్యర్థులకు టీజేఎస్‌ బీ ఫారాలిచ్చింది. మరోవైపు మిర్యాలగూడ స్థానాన్ని ఆశించిన జానారెడ్డి కుమారుడికి సీటు లేనట్టే అని తేలిపోయింది. టీజేఎస్‌ పోటీ చేస్తుండటంతో కూటమి నుంచి జానా కుమారుడికి సీటు లేనట్లే అని తేలిపోయింది.

తుదిజాబితా వెల్లడించిన కేసీఆర్

Submitted by chandram on Sun, 11/18/2018 - 17:40

తీవ్ర కసరత్తు అనంతరం టీఆర్ఎస్ ఫైనల్ లిస్టు విడుదలయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఇద్దరు అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో తాజా ప్రకటనతో మొత్తం 119 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. కోదాడకు -బొల్లం మల్లయ్య యాదవ్ , ముషీరాబాద్‌ -ముఠా గోపాల్‌ ఖరార్.

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 17:19

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. కోదాడ స్థానానికి బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే ముషీరాబాద్ స్థానానికి  ముఠా గోపాల్  అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కేసీఆర్.  ముఠా గోపాల్ కు స్వయంగా మంత్రి నాయని నరసింహారెడ్డి బీఫామ్ అందజేశారు. రేపు వీరు నామినేషన్ వేయనున్నారు. కాగా ముషీరాబాద్ సీటుకోసం నాయని నరసింహా రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు.  తనకు కాదంటే తన అల్లుడు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికైనా టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. గత  ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా ముఠా గోపాల్ కే అవకాశం దక్కింది. 

19 మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల

Submitted by chandram on Sun, 11/18/2018 - 17:05

తెలంగాణ బీజేపీ 19మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు 112 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులలో హడవిడి మొదలైంది.

హయత్‌ హోటల్‌లో బుజ్జగింపుల పర్వం..

Submitted by chandram on Sun, 11/18/2018 - 16:25

ఆశావహులు, అసంతృప్తులు, రెబల్స్‌తో కాంగ్రెస్‌ బుజ్జగింపుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో కమిటీతో అసంతృప్తులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పొత్తుల పేరుతో తమకు టిక్కెట్లు నిరాకరించొద్దంటూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్‌ వెస్ట్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత 20 యేళ్లుగా కాంగ్రెస్‌ కు అవకాశం రాలేదని ఈ సారి టీడీపీ గెలిచే అవకాశం లేదని కమిటీ ముందు వాపోయారు. 

ఒక్కటికెట్ కేటయించడంపై యాదవ సంఘాల ఆందోళన

Submitted by chandram on Sun, 11/18/2018 - 16:12

గాంధీభవన్ వద్ద యాదవ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. యాదవులకు ఒక్కటికెట్ మాత్రమే కేటాయించడంపై నిరసనకు దిగిన నేతల కనీసం 5 టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. దీంతో యాదవుల సమస్యను అదిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వీహెచ్ హామీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యాదవులకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..కాంగ్రెస్‌‌‌‌‌లో వీడని ఉత్కంఠత

Submitted by chandram on Sun, 11/18/2018 - 15:47

రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరు స్థానాల్లో అభ్యర్థులింకా ఖరారు కాకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 94 స్థానాలకు గానూ 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఆరు సీట్లలో పీఠముడి ఇంకా వీడటం లేదు. తుదిజాబితా కోసం ఎడతెగని కసర్తత్తు జరుగుతూనే ఉంది. కుంతియా, ఉత్తమ్‌లు ఆశావహులతో భేటీలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. 

రేప్‌ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

Submitted by chandram on Sun, 11/18/2018 - 15:15

ఎప్పడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం బీజేపీ నేతలకు కొత్తేమి కాదు అయితే తాజాగా మరోసారి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  80 నుంచి 90 శాతం రేప్‌, ఈవిటీజింగ్‌ కేసుల్లో బాధిత మహిళలు ఏదైనా సమస్య లేదా వాగ్వాదం జరిగినప్పుడే..  కేసులు పెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ మహిళాలోకానికే వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి కలిన వ్యక్తి అత్యాచారాలను ఆరికట్టాల్సిందిపోయి.

రేపు పీపుల్స్ ఫ‌్రంట్ మేనిఫెస్టో విడుదల..

Submitted by chandram on Sun, 11/18/2018 - 14:44

ప్రజలంటే పట్టింపులేకుండా ఇష్టానుసారంగా అధికారం చెలాయించే వాళ్లకు పాలించే అర్హత లేదన్నారు పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ కోదండరాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా తమ మేనిఫెస్టో ఉందని, రేపు తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని ఆయన చెప్పారు. సాయంత్రంలోగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. కోదండరాం మాట్లాడుతూ ఓట్లుకొనుక్కోవడంతోని రాజకీయాలు మారుతయని తను అనుకోవడంలేదని ప్రజలకు రాజకీయాల్లో ఎటువంటి లాభం జరుగుతదో, రాజకీయాల ద్వారా ఎలంటి మేలు చేయోచ్చో ప్రజలకు మనం నచ్చజేబితే ఖచ్చితంగా ప్రజల మద్దత్తు పొందుతామని కోదండరాం స్పష్టం చేశారు.