Just In

బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యకు బీజేపీ బంపర్ ఆఫర్

Submitted by arun on Wed, 09/26/2018 - 17:51

బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యకు తెలంగాణ  బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.  పార్టీలోకి వస్తే ఎంపీ సీటు ఇస్తామంటూ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన యెన్నం శ్రీనివాసరెడ్డితో పాటు ఎవరూ వచ్చిన ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన తొలి విడత అభ్యర్ధుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. వచ్చే నెలలో అమిత్‌షాతో  వరంగల్‌, కరీంనగర్‌‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.  

కాంగ్రెస్ లో కొండాకు కీలక పదవి..?

Submitted by arun on Wed, 09/26/2018 - 17:33

కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. 

విశాఖ మన్యంలో మరోసారి అలజడి...డీజీపీ పర్యటన సమయంలోనే...

Submitted by arun on Wed, 09/26/2018 - 17:18

ఏపీ డీజీపీ ఠాకూర్‌లో విశాఖ మన్యంలో పర్యటిస్తుండగానే మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ MKVB కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న లేఖలను అంటించారు. గురుప్రియ సేతు బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలంటూ ఈ లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసి ఖనిజ సంపదను కార్పోరేట్లను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. బల్ల రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని తగ్గించాలంటూ లేఖలో కోరారు. డీజీపీ పర్యటన సమయంలోనే మావోయిస్టుల లేఖలు వెలియడంతో మరోసారి అలజడి రేగింది. 

అరకు హత్యాకాండలో కీలకపాత్రధారి కలకలం...ఎప్పుడేం జరుగుతుందోనన్న...

Submitted by arun on Wed, 09/26/2018 - 17:02

దుబ్బపాలెం... తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గిరిజన కుగ్రామం. చుట్టూ కొండలు మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉండే దుబ్బపాలెంలో ప్రస్తుతం అలజడి నెలకొంది. అక్కడి గిరిజనులంతా భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎందుకంటే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడైన జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో, అలియాస్ సునీల్‌ స్వగ్రామం అది. పోలీసులు ఆ గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  

అత్తాపూర్ లో మర్డర్.. అక్రమ సంబంధం కారణంగానే రమేశ్ హత్య!

Submitted by arun on Wed, 09/26/2018 - 16:48

హైదరాబాద్‌‌లో మరో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై పట్టపగలు నడిరోడ్డు మీద కత్తితో దాడి చేసిన ఘటన కళ్ల ముందు మెదులుతుండగానే అత్తాపూర్‌‌లో ఇదే తరహాలో దాడి జరిగింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దుండగులు కత్తితో దాడి చేశారు.

విశాఖలో స్కూల్ బస్సుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

Submitted by arun on Wed, 09/26/2018 - 16:16

విశాఖ గాజువాకలో పెను ప్రమాదం తప్పింది. రవీంద్ర భారతి స్కూల్‌కు చెందిన రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న బస్సుల్లోంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది ..హుటాహుటిన మిగిలిన బస్సులను  అక్కడకు నుంచి తీసివేశారు. ఈ ఘటనలో రెండు బస్సులు కాలి బూడిద కాగా సమీపంలోని మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

Tags

ముంబైలో మిరాకిల్‌...రోడ్డుపై కూర్చున్న బాలుడిపై నుంచి పోయిన కారు

Submitted by arun on Wed, 09/26/2018 - 15:02

అదృష్టం అంటే  ఈ బుడ్డోడిదే . యముడు ఎదురుగా వచ్చిన ఏమీ జరగలేదు. అదృష్టవంతుడు కాబట్టే  మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.  భూమిపై నూకలు ఉంటే  భూకంపం నుంచైనా బయటపడతాం అనేదానికి ఉదాహరణగా నిలిచాడు. కారు పిల్లాడి మీద నుంచి వెళ్లిన క్షేమంగా బయట పడిన ఘటన ముంబైలో జరిగింది.

ఫ్రెండ్‌తో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న చిన్నోడు  షూ లేస్‌ ఊడిపోవడంతో కారు పక్కన కూర్చోని తాపీగా కట్టుకుంటున్నాడు. అంతలో ఓ యువతి  రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారు సడెన్‌గా  రైట్ సైడ్‌కి తిప్పింది.  కింద కూర్చున్న బాబును గమనించ కుండా  వేగంగా  ముందుకు తీసింది. దీంతో  కారు కాస్త  బాబుపై  నుంచి దూసుకెళ్లింది. 

ధర్మపురి అరవింద్‌ సవాల్‌ ...నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి కవితను పోటీ చేయించే ధమ్ముందా..?

Submitted by arun on Wed, 09/26/2018 - 14:32

టీఆర్ఎస్‌ పాలనలో ఏం ప్రగతి జరిగిందని.. నిజామాబాద్‌లో సభ పెడుతున్నారని.. బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ప్రగతి నివేదన సభలు కావని.. సోది సభలని ఎద్దేవా చేశారు. అలాంటి సోదిని వినేందుకు నిజామాబాద్‌ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అయిన కవితను పోటీచేయించే ధైర్యం ఉందా అని అరవింద్‌ సవాల్‌ విసిరాడు. 

ఎల్లారెడ్డి లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన మార్కల్‌ గ్రామస్తులు

Submitted by arun on Wed, 09/26/2018 - 14:20

 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌కే కంచుకోటగా నిలిచే మార్కల్‌ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి గ్రామాభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. దీంతో టీఆర్ఎస్‌ నేతలు గ్రామంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రామానికి వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమయ్యారు. దీంతో గ్రామంలో  టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

మత్తెక్కించే అమ్మాయిలతో మజా చేయండంటూ ఆఫర్లు...

Submitted by arun on Wed, 09/26/2018 - 13:57

డేటింగ్‌ సైట్లతో టోకరా పెడుతున్న కేటుగాళ్లను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బెంగాల్‌ కేంద్రంగా సాగుతున్న ముఠా కార్యకలాపాల గుట్టును రట్టు చేశారు. అమ్మాయిల అర్దనగ్న ఫోటోలను చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న దుండగులకు చెక్ పెట్టారు. రెండేళ్లలో ఏకంగా 150 కోట్లు వసూలు చేసిన ముఠా ఆటకట్టించారు.