Kerala floods

వరద మిగిల్చిన విషాదం...

Submitted by arun on Tue, 08/21/2018 - 12:23

వరదల బీభత్సంతో కకావికలమైన కేరళ రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భవనాలు, నిర్మాణాలన్నీ ధ్వంసమయ్యాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో భవనాలు, నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని భావిస్తున్నారు. గత వందేళ్లలో కాలంలో ఎన్నడూ లేనంతగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రానికి దాదాపుగా రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా పడింది.

కేరళలో రియల్ హీరో....బాలుడిని కాపాడిన కమాండర్

Submitted by arun on Tue, 08/21/2018 - 10:38

కేరళలో 80 శాతం భూభాగం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసినా వరద నీరే. ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తుండటంతో ప్రజలు ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వరదల్లో చిక్కుకుపోతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని కొందరు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీకల్లోతు నీటిలో నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు కొందరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వరద బాధితులకు కీర్తిసురేశ్ భారీ సాయం

Submitted by arun on Tue, 08/21/2018 - 10:19

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. కాగా ‘మహానటి’ సినిమాతో భారీ సక్సెస్‌ని అందుకున్న మళయాలీ భామ కీర్తీ సురేష్ కేరళ బాధితులకు భారీ సాయాన్ని అందజేసింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.10 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్, బట్టలు, నిత్యావసర వస్తువులు, మందుల కోసం మరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది.
 

మానవత్వాన్ని చాటుకున్న బాబు గోగినేని

Submitted by arun on Tue, 08/21/2018 - 08:46

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ బాబు గోగినేని మానవత్వాన్ని చాటుకున్నారు. బిగ్‌‌బాస్‌ షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు సాయం చేశారు. 20 లక్షల రూపాయల డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి పంపారు. 

జర్నీ హీరోయిన్ ఇల్లు మునక

Submitted by arun on Mon, 08/20/2018 - 16:01

ప్రకృతి.. జనం మధ్య తేడాలు చూపదు. ధనిక, పేద, హీరో, సామాన్యుడు అనే తేడాలేం వుండవు. అఆ, జర్నీ తదితర చిత్రాల్లో నటించి తెలుగువారికి కూడా చేరువైన నటి అనన్య కష్టాల్లో ఉంది. కేరళ వరదల్లో ఆమె ఇల్లు కూడా మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలైన సహనటి ఆశా శరత్ ఇంట్లో తలదాచుకుంటోంది. `మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే నీటిమ‌ట్టం పెరిగిపోతోంది. ఇప్ప‌టికీ వ‌ర్షం కురుస్తోంది. మా స‌న్నిహితులు, బంధువుల ఇళ్లు కూడా మునిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మా ఇంట్లో ఉండ‌గ‌లిగాం. ఇప్పుడు న‌టి ఆశా శ‌ర‌త్ ఇంట్లో త‌ల దాచుకుంటున్నాం.

రణక్షేత్రంలోనే కాదు జలవిలయంలోనూ సైన్యం సాయం

Submitted by arun on Mon, 08/20/2018 - 14:30

యుద్ధరంగంలో శతృవులను మట్టికరిపించే యోధులు వారు. సరిహద్దు వెంబడి పహారా కాస్తూ దేశాన్ని రక్షించే వీరులు వారు. దేశ ప్రజలంతా సుఖంగా నిద్రించేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టే ధీరులు వారు. ఇవాళ యావత్‌ దేశం భద్రంగా ఉందంటే సాహసానికి సిద్దంగా ఉన్న సైన్యం వల్లే. అలాంటి సైన్యం రణక్షేత్రంలోనే కాదు ప్రకృతి విపత్తుల్లో కూడా తమ సత్తా చాటుతోంది. మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది. ఇప్పుడు జల ప్రళయంలో చిక్కుకున్న కేరళలోనూ సైన్యం మరువలేని సాయం చేస్తోంది.

Image result for kerala floods army

కేరళకు వైఎస్‌ జగన్‌ భారీ విరాళం

Submitted by arun on Mon, 08/20/2018 - 13:25

వరదలతో అల్లకల్లోలమైన కేరళను ఆదుకునేందుకు రాష్ట్రాలు, ప్రముఖులు, సామాన్యులు కూడా చేయి కలిపారు. ఆపదలో ఉన్న మలయాళీలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్‌సీపీ పంపనుంది.