Kerala floods

కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్

Submitted by arun on Tue, 09/04/2018 - 16:24

మన బాహుబలి ప్రభాసే బెస్ట్,

కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్,

హీరో ప్రబాసుని పొగిడగానే ఫస్ట్,

కేరళ హీరోలకి క్లాసు తీసుకొనే నెక్స్ట్. శ్రీ.కో. 

ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి...మలయాళ నటులపై కేరళ మంత్రి ఆగ్రహం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:41

కేరళకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ప్రభాస్‌‌పై కేరళ టూరిజం మంత్రి సురేంద్రన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలని మలయాళ నటులపై మండిపడ్డారు. కేరళ బాధితుల సంరక్షణ నిమిత్తం ‘కేర్‌ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సురేంద్రన్‌ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ బాధితుల కష్టాలు చూడలేక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు.

కేరళలో ఒకే ఇంట్లో వంద పాములు

Submitted by arun on Fri, 08/24/2018 - 16:20

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో  ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాడైపోయిన తమ వస్తువులు, ఇతరాలను చూసి బావురుమంటున్నారు. కొందరి ఇళ్ళలో నీటిలో  కొట్టుకొచ్చిన పాములు, విష కీటకాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేరళలో వరదలు తగ్గు ముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు కేరళకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదల వల్ల ఇప్పటివరకూ దాదాపు 350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాలు ఇళ్లు, రోడ్లు నీళ్ల మయంగా మారాయి. 

మా వ‌ర‌ద‌ల‌కు మీరే కార‌ణం...కేర‌ళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Submitted by arun on Fri, 08/24/2018 - 11:52

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు యావత్ భారతం కదులుతోంది. అయితే, ఇది ప్రకృతి విపత్తుకాదని తమిళనాడు చేసిన నిర్వాకమని కేరళ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. తమిళనాడు తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేరళ ముళ్లపెరియార్‌ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్‌ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

కేరళ వర్షాలపై నాసా శాటిలైట్ వీడియో

Submitted by arun on Thu, 08/23/2018 - 12:53

నైరుతి రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. ఈ మేరకు భారత దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది. భారత్‌లో ఇది వర్షాలకు అనుకూల సమయమన్న నాసా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కేరళలో ఎడతెరపి లేకుండా వందల సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.

కేరళకు లారెన్స్‌ భారీ విరాళం..!

Submitted by arun on Thu, 08/23/2018 - 12:03

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు.
 

ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు

Submitted by arun on Wed, 08/22/2018 - 14:16

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా...ఇళ్లకు చేరుతున్న వారికి పాములు, మొసళ్లు దర్శనమిస్తున్నాయ్. మొన్నటి వరకు వరదలు వణికిస్తే ఇప్పుడు మొసళ్లు, పాములు భయపెడుతున్నాయి. పునరావాసాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వారికి ఇళ్లలో పాములు, మొసళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కేరళలో వరద తగ్గినా స్థానికుల కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. 

కేరళలో ఆపరేషన్‌ గరుడ...ఒక సాహసం.. 26 మంది ప్రాణాలు

Submitted by arun on Tue, 08/21/2018 - 14:16

కేరళలో సహాయక బృందాలు చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రాణాలకు తెగించి మరీ ఆపన్నులను కాపాడుతున్నారు. చలకుడ్డి నగరంలో ఓ నేవీ పైలెట్ చేసి సాహసం ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. అత్యంత ధైర్యసాహసాలతో అంతకంటే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ పైలెట్ 26 మంది ప్రాణాలు కాపాడాడు.

కేరళకు 700కోట్ల భారీ సాయం ప్రకటించిన అరబ్‌ దేశం!

Submitted by arun on Tue, 08/21/2018 - 13:47

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది మేమున్నామంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. కేరళ రాష్ట్రాన్ని, వరద బాధితులను ఆదుకోడానికి యావత్ భారత దేశం కదిలింది. అయితే కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా కేరళకు భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే గల్ప్ దేశాల్లో ఒకటైన ఖతార్ రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ. 700 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.