Cmrf

కేటీఆర్‌ను సర్‌ప్రైజ్ చేసిన నటుడు సుబ్బరాజు

Submitted by arun on Sat, 08/04/2018 - 13:45

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను నటుడు సుబ్బరాజు సర్‌ప్రైజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న మంత్రిని సుబ్బరాజు కలిశారు. ఇందులో సర్‌ప్రైజ్ ఏముందని అనుకుంటున్నారా..? ‘రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండగా.. సుబ్బరాజు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం చెక్ అందజేశార’ని కేటీఆర్ తెలిపారు. మంచి మనసుతో స్పందించినందుకు థ్యాంక్స్ బ్రదర్ అంటూ ఆయన సుబ్బరాజును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌కి వ‌చ్చిన మొద‌టి ఫిలిం ఫేర్ అవార్డుని వేలం వేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుని సీఎంఆర్ ఎఫ్‌కి విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే.