hyderabad

అబ్బాయిని చూడమని చెప్పాను...

Submitted by chandram on Wed, 11/21/2018 - 14:25

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌ వ‌రుడ్ని వేతికే పనిలో పడింది. తాజాగా రకుల్ ఆంగ్ల మీడియా ఇంటర్వూ నిర్వహించింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ఇంకా ఒంటరిగానే ఎందుకు ఉన్నారు? అని అడిగిన ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ నాకు ప్రేమించే సమయం కూడా లేదని, నా సినిమా షెడ్యూల్ తోనే సరిపోతుంది ఇక నేను వరుడ్ని చేసుకునే తీరికే లేదని స్పష్టం చేసింది. అయినా నేను ఇప్పటికి ఒంటరిగా ఎందుకు ఉన్నానో నాకే తెలియదని తెలిపింది కాని అందుకే హైదరాబాద్ లో ఉన్న నా స్నేహితులకు నాకు మంచి అబ్బాయిని చూడమని చెప్పాను.

పట్నం చేరుకున్న ఏఐసీసీ బుజ్జగింపుల కమిటీ

Submitted by chandram on Sun, 11/18/2018 - 11:43

రెబల్ అభ్యర్ధులు, అసంతృప్తులను దారికి తెచ్చేందుకు బుజ్జగింపుల కమిటీ రంగంలోకి దిగింది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు ఈ  ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. కమిటీ సభ్యులుగా ఉన్న కర్నాటక మంత్రి శివకుమార్‌, పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి, మంత్రి మాల్లాది కృష్ణరావులు అసంతృప్త నేతలతో స్వయంగా చర్చించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన టీ పీసీసీ పూర్తి నివేదికను కమిటీ సభ్యులకు అప్పగించింది. రెబల్ అభ్యర్ధులను పోటీ నుంచి తప్పించేందుకు తొలి ప్రాధాన్యతగా చర్చలు ప్రారంభించారు.   

కొండమీద ఉన్న కోడి దిగొచ్చింది..

Submitted by chandram on Sun, 11/18/2018 - 11:36

కార్తీకమాసం ఎఫెక్ట్‌తో ధరలు కుప్పకూలాయి. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. అయినా కొనేందుకు జనం రావడం లేదు. దీంతో ఆ షాపులు వెలవెలబోతున్నాయి. ఇంతకీ ఆ షాపులేంటి? ఆ వ్యాపారమేంటి అనుకుంటున్నారా? లుక్. కొండమీద ఉన్న కోడి దిగొచ్చింది. దాని ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేశాయి. అయినా కార్తీకమాసం కావడంతో కొనేవారు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటంతో ధరలు మరింతగా దిగజారిపోతున్నాయి. దీంతో చికెన్ వ్యాపారులతోపాటు పౌల్ట్రీ వారికీ నష్టాలు తప్పడం లేదు. మాంసం ప్రియులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్స్ ప్రకటిస్తున్నా జనం అంతగా ఆసక్తి చూపడం లేదు. 

ఇంకా ఎన్ని బోగస్‌ ఓట్లు చూడాలో!!

Submitted by arun on Sat, 11/10/2018 - 12:17

హైదరాబాద్ లో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఒకే ఇంట్లో 183 నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లో కేవలం ఒకే ఒక వృద్ధురాలు వుంటుంది. కానీ , ఆ ఇంటి పేరిట 183 బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని బీజేపీ నేతలు బయటపెట్టారు. 

లంగర్ హౌజ్ పరిధిలోని బాపు నగర్ లోని ఓ ఇంట్లో భారతమ్మ అనే వృద్ధురాలు అద్దెకు ఉంటుంది. ఈమె గత ఏడాదిన్నర నుంచి ఈ ఇంట్లో నివసిస్తుంది. ఈ ఇల్లు బూత్ నెంబర్ 141 పరిధిలోకి వస్తుంది. ఈ ఇంటి పేరిట ఏకంగా 183 ఓట్లు వుండడం చూసి బీజేపీ బూత్ ఇన్ ఛార్జ్ లు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లో భారతమ్మ తప్ప ఇతరులెవరూ కనిపించకపోవడంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. 

సదర్ సంబరాలకు పట్నం తయార్...

Submitted by arun on Thu, 11/08/2018 - 11:22

సంస్కృతిలో భాగమైన సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజున ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం ఇవాళ, రేపు జరగనుంది. ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. సదర్‌  ఉత్సవాలకు భాగ్యనగరం నగరం సన్నద్ధమైంది. నిజాం నవాబుల కాలం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల ఐక్యతకు, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనం. ఏటా దీపావళి మరుసటి రోజు సదర్‌ వేడుకలను నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌లో ఇవాళ, నారాయణగూడ వైఎంసీఏ ఈ నెల 9న వద్ద వేడుకలు జరుగనున్నాయి.

రసవత్తరంగా మారిన చొప్పదండి రాజకీయాలు

Submitted by arun on Thu, 11/08/2018 - 10:29

చొప్పదండి రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ భూమారెడ్డి తీరును వ్యతిరేకించిన ఎంపీటీసీలు తిరుగుబావుటా ఎగురవేశారు. 11 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆగ్రహించిన అధికార పక్షం ఎలాగైనా అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగింది. ఎంపీటీసీలు తలదాచుకున్న శిబిరంపై పోలీసులతో దాడికి దిగింది. ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురిచేసి, వారిపై అక్రమ కేసులు బనాయించారు. దీంతో తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధిత ఎంపీటీసీలు.

లక్డీకపూల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్

Submitted by arun on Thu, 11/08/2018 - 10:13

హైదరాబాద్ లక్డీకపూల్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడు. ఆర్టీసీ బస్సు ఎక్కిన కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోమని కండెక్టర్ కోరగా నన్నే టికెట్ అడుగుతావా అంటూ ఎదురుదాడికి దిగాడు. టికెట్టు తీసుకోకుంటే కిందకి దిగిపోమని కండెక్టర్ అనడంతో అసభ్య పదజాలంతో నోటికి వచ్చినట్లు దూషించాడు. పోలీస్ స్టేషన్ లో పడేసి చితక్కొడతా అంటూ బెదిరించాడు దీంతో తోటి ప్రయాణికులు కానిస్టేబుల్ ను నిలదీయడంతో చేసేదేమీ లేక అసెంబ్లీ బస్టాప్ వద్ద దిగిపోయాడు. ఈ వ్యవహారాన్ని ఒకరు వీడియో తీయడంతో అదికాస్త ఇప్పుడు వైరెల్ గా మారింది. 

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత... 7 కోట్ల నగదు సీజ్

Submitted by arun on Wed, 11/07/2018 - 12:57

హైదరాబాద్ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. సైఫాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 7కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ నగదును ముంబై, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం. నగదును తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక హైదరాబాద్‌లో ఈ స్థాయిలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Mon, 11/05/2018 - 10:36

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫలక్‌నుమ పోస్టాఫీస్ దగ్గర చెప్పుల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపునకు యత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో గోదాం పక్కనే ఉన్న జి ప్లస్ భవనాన్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియలేదు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచానా.

హైదరాబాద్‌ మూసాపేట్‌ బ్రిడ్జీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Submitted by arun on Mon, 11/05/2018 - 10:26

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేట్‌ బ్రిడ్జీ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. దీంతో మూసాపేట్‌ బ్రిడ్జీ ప్రాంతంలో వాహనాలతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఇటు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.