suresh reddy

కారెక్కిన వారికీ కాంగ్రెస్‌ పదవులు...టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి 3 కీలక పదవులు...

Submitted by arun on Thu, 09/20/2018 - 10:24

కాంగ్రెస్‌ కొత్త కమిటీలపై గొడవ మొదలైంది. వీహెచ్‌, పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గులాబీ కండువా కప్పుకున్న సురేష్‌ రెడ్డికి, పలు కమిటీల్లో చోటు కల్పించడం కూడా చర్చనీయాంశమమైంది.

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నూతన కమిటీలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు మండిపడ్డారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో సీనియర్ నేత  వీహెచ్ తీవ్ర స్ధాయిలో అసంతృప్తి చెందారు. గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన, వాహనం కోసం కూడా ఎదురుచూడకుండా  నాంపల్లి సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. 

‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Submitted by arun on Sat, 09/08/2018 - 10:06

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు మధుయాష్కి తెలిపారు. సిట్టింగ్ స్పీకర్‌గా ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని టీఆర్ఎస్‌ స్వాగతించిందంటే ఆ పార్టీ గెలుపోటములు సూచిస్తున్నాయని.. మదుయాష్కి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు.

సురేష్‌రెడ్డి హస్తం పార్టీనీ వీడటం...ఇద్దరు సిట్టింగ్‌లలో టెన్షన్

Submitted by arun on Fri, 09/07/2018 - 16:09

అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. హస్తం పార్టీ నేతలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కుదుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పేరున్న మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించింది. సురేష్‌రెడ్డి కూడా హస్తానికి హ్యాండిచ్చి.. కారులో షికారుకు సై అన్నారు. ఈనెల12న తన అనుచరులతో టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకోనున్నారు. సురేష్‌రెడ్డి పార్టీ వీడనుండటం వల్ల నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు కొలుకోలేని దెబ్బతగిలింది. ఆయన పార్టీ మార్పుతో రెండు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడనుంది. సురేష్‌రెడ్డి రాకతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి...సాదర స్వాగతం పలికిన కేటీఆర్‌

Submitted by arun on Fri, 09/07/2018 - 12:47

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్  కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సురేష్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్‌ భేటి అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలంటూ కేటీఆర్ ఆహ్వానించారు.  ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు వివేక్‌తో పాటు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ సురేష్‌రెడ్డికి తమ పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తామన్నారు.   

మాజీ స్పీకర్ పోటీ ఎక్కడ ...రెండు నియోజకవర్గాలపై మాజీ స్పీకర్ కన్ను

Submitted by arun on Wed, 07/25/2018 - 12:45

క్రమ శిక్షణకు మారుపేరు ఆ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అత్యున్నత పదవి చేపట్టి మెప్పించ్చిన సీనియర్ నేత. లోకల్ నియోజకవర్గాన్ని కాదని వెళ్లిన ఆయనకు గడ్డు పరిస్ధితి ఎదురైంది. నాన్ లోకల్ స్ధానంలో అదృష్టం పరీక్షించుకున్న సదరు నేతకు రెండు సార్లు చుక్కెదురైంది. దీంతో ఆయన రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. ఇడా ఉంటా ఆడా ఉంటా అంటూ రెండు నియోజకవర్గాలపై కన్నేసిన ఆయనకు లోకల్ నియోజకవర్గ నేతల నుంచి ముప్పు ఎదురవుతోంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆ నేత ఎవరు? గురి పెట్టిన నియోజకవర్గం ఏది?