road accident

రోడ్డుప్రమాదంలో ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు

Submitted by arun on Mon, 05/28/2018 - 16:40

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం  గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మహానాడు కోసం ఎమ్మెల్యే  సుగుణమ్మ విజయవాడ వచ్చారు. ప్రమాదంపై పలువురు నేతలు సుగుణమ్మకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు

కువైట్‌లో ఘోర ప్రమాదం: 17మంది మృతి

Submitted by arun on Mon, 04/02/2018 - 11:57

కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది భారతీయులు మృతిచెందారు. బుర్గాన్‌ చమురు నిక్షేపాల్లో విధులు ముగించుకున్న కార్మికులు.. 2 బస్సుల్లో ఇళ్లకు తిరుగుప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 11 మంది భారతీయులతో పాటు ఈజిప్ట్‌, పాకిస్తాన్‌కు చెందినవారున్నారు.

ఆటోవాలా అత్యాశకు 11మంది బలి

Submitted by arun on Mon, 03/26/2018 - 10:48

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం..డబ్బు మీద అత్యాశ 11 మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో 11 మంది చనిపోయారు. ఆటో డ్రైవర్ సహా నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పరిమితికి మంచి ప్రయాణికుల్ని ఆటోలో ఎక్కించడంతో పాటు అతి వేగమే ప్రమాదానికి కారణమని తేలింది.  

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Submitted by arun on Sun, 03/25/2018 - 16:35

నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఓ చిన్నారి సహా ఐదుగురు చనిపోయారు. మరో 9 మందిని స్థానికులు కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలు

Submitted by arun on Sun, 03/25/2018 - 11:27

రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ గాయపడ్డాడు. డెహ్రడూన్‌ నుంచి ఢిల్లీ వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. డెహ్రడూన్‌లో చికిత్స తీసుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడని సన్నిహితులు వెల్లడించారు. భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణలు చేయడంతో వ్యక్తిగత జీవితంలో షమీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు.  

ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం

Submitted by arun on Sat, 03/10/2018 - 16:53

చావు. అందరికీ భయమే. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కాటేసే మరణమంటే చచ్చేంత భయం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో...ఎవ్వరూ చెప్పలేరు. కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి చావు దుర్మార్గమా చిదిమేస్తుంది. కారుణ్యం చూపించనంత కఠినంగా కాటేస్తుంది. ఖమ్మం జిల్లాలో నిన్న అదే జరిగింది. పెళ్లయిన కేవలం ఆరంటే ఆరు గంటల్లోనే మృత్యువు దారుణంగా పాశం వేసింది. పాశవికంగా ప్రాణాలు తీసేసింది. చావు ఎదురయ్యే ఆ క్షణం ముందే తెలిసిపోయిన ఆ ప్రాణాలు ఎంత అవిసిపోయాయో... ఎంతగా అల్లాడిపోయాయో పాపం.

హైదరాబాద్‌ ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Fri, 03/02/2018 - 17:17

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్‌ నుంచి పటాన్‌ చెరు వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు డివైడర్ ను దాటి బస్సును ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటు బస్సు కూడా రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. మృతులంతా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌కు చెందిన వారని తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. బస్సు కూడా ధ్వంసమైంది. 

రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

Submitted by arun on Wed, 02/21/2018 - 09:50

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అతివేగంతో వస్తున్న ఓ కారు.. డివైడర్ పైకెక్కి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 

బ్రేకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సతీమణికి గాయాలు...

Submitted by arun on Wed, 02/07/2018 - 11:45

రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోడ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఆమెను చిత్తోడ్‌లో ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందనీ... వైద్యులు ఆమెకు చికిత్సి అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Sun, 01/14/2018 - 12:11

పండగపూట  పొగమంచు ఓ ఇంట విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో తమిళనాడు రాష్ట్రంలోని వేళంగిని దేవాలయానికి వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. కాగా... సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు.