sonali bendre cancer

క్యాన్సర్‌తో పోరాడుతున్న సోనాలి బింద్రే..‌..

Submitted by arun on Wed, 07/04/2018 - 14:11

సోనాలీ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్‌ న్యూస్‌. నిజంగా వెరీ బ్యాడ్‌ న్యూస్‌. తన అందాలతో  టాలీవుడ్‌, బాలీవుడ్‌‌ను ఊపేసిన సోనాలి ఉన్నట్టుండి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టింది. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలీ బింద్రే ట్విట్‌ చేసింది. వైద్యుల సలహా మేరకు హైగ్రేడ్‌ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకునేందుకు న్యూయార్క్‌కు వెళ్తున్నట్లు సోనాలీ బింద్రే తన ట్విట్టర్‌లో తెలిపింది. క్యాన్సర్‌ చికిత్సలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పింది. క్యాన్సర్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహతులు తనకు సపోర్ట్ చేశారని తెలిపింది.