lord rama

రాముడి రూపంలో కేసీఆర్ కటౌట్

Submitted by arun on Sun, 09/02/2018 - 14:13

టీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కటౌట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కటౌట్‌ను శ్రీరాముడి రూపంలో ప్రదర్శించారు. ఈ కటౌట్‌లో కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఫోటోలను ప్రదర్శించి ప్రగతి నివేదన సభకు తరలిరండి అని స్వాగతం పలికారు టీఆర్‌ఎస్ నాయకుడు తేరుపల్లి రమేష్.

బయటకొచ్చిన కత్తి మహేష్‌.. రాముడిపై మళ్లీ పోస్ట్‌

Submitted by arun on Tue, 07/03/2018 - 13:31

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు..విచారించి విడుదల చేశారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ...బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో కత్తి మహేష్ పై నాలుగు కేసులు నమోదయ్యాయ్. దీంతో పోలీసులు కత్తి మహేశ్ ను రాత్రి ప్రశ్నించారు. కొద్ది సేపటి తర్వాత ఆయన్ను ఇంటికి పంపించేశారు. విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించి పంపారు. ఆపై కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ "కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే.