shraddha kapoor

సాహోలో ప్రభాస్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Submitted by arun on Mon, 01/22/2018 - 16:06

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న మూవీ సాహో. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి, ఎలా కనిపించబోతున్నాడనే వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా సాహోలో ప్రభాస్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ టూ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

శ్రద్ధాకపూర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

Submitted by arun on Wed, 12/27/2017 - 16:38

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా 'హసీనా పార్కర్' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అపూర్వ లఖియా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ శ్రద్ధాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో శ్రద్ధ వేసుకున్న దుస్తులను ముంబయికి చెందిన ఓప్రముఖ దుస్తుల కంపెనీ డిజైన్‌ చేసిందట. కంపెనీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే ముందు సినిమాలో దుస్తుల కంపెనీ పేర్లు వేస్తామని చెప్పి నిర్మాత నహిద్‌ ఖాన్‌ మాటిచ్చారట.

పోలీస్ పాత్రలో శ్ర‌ద్ధా క‌పూర్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 16:57

'ఆషిఖీ 2' చూసిన వారెవ‌రైనా ఆ చిత్ర క‌థానాయిక శ్ర‌ద్ధా క‌పూర్ న‌ట‌న‌కి, గ్లామ‌ర్‌కి ఫిదా అవ్వాల్సిందే. అంత‌గా ఆ సినిమాలో మెప్పించింది శ్ర‌ద్ధా. ఆ త‌రువాత మ‌రికొన్ని హిట్ చిత్రాల్లో మెరిసిన ఈ చిన్న‌ది.. తొలిసారిగా ఓ ద‌క్షిణాది చిత్రం చేస్తోంది. అదే ప్ర‌భాస్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రం 'సాహో'. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.