Avuna

మొదటి మోటరైజడ్ ఎయిర్ క్రాఫ్ట్!

Submitted by arun on Tue, 11/13/2018 - 11:40

రైట్ బ్రదర్స్ ఎప్పుడు మొదటి మోటరైజడ్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ఆవిష్కరించారో మీకు తెలుసా! మొదటి మోటరైజడ్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ఆవిష్కరించరించిన సంవత్సరం... 1903 శ్రీ.కో.

ఇంటర్నెట్టు ఎ సంవత్సరం!

Submitted by arun on Tue, 11/13/2018 - 11:36

ఇంటర్నెట్టుని ఎ  సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)"లో సృస్టించబడినదో మీకు తెలుసా!.... ఇంటర్నెట్టు సృస్టించబడిన సంవత్సరం ...1969. శ్రీ.కో.
 

తొలి పర్సనల్‌ కంప్యూటర్‌!

Submitted by arun on Mon, 11/12/2018 - 14:58

తొలిసారి పర్సనల్‌ కంప్యూటర్‌ను ఎ కంపెనీ 1981లో తయారుచేసిందో మీకు తెలుసా! అయితే...దీనిలోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, బేసిక్‌ కంప్యూటరు భాషను మైక్రో సాఫ్ట్‌ రూపొందించింది అనేది.. మీకు క్లూ......... తొలిసారి పర్సనల్‌ కంప్యూటర్‌ను ఐబీఎం వారు చేసారు. శ్రీ.కో.

ఇప్పుడు సూప్ అనే...గంజి ఎ దేశంలో మొదలెట్టారు

Submitted by arun on Mon, 11/12/2018 - 14:54

గంజి ఎ దేశంలో మొదలైందో...మీకు తెలుసా... గంజి అంటే...బియ్యము ఉడకబెట్టి వార్చిన నీరు. గంజి అనే పదం ద్రవిడ భాషలలో కంజి అనే పదం నుండి ఆవిర్భవించింది. వెబ్ స్టర్ ఆంగ్ల నిఘంటువులో కంజి ( గంజి)  భారతదేశం నుండి పుట్టినదని తెలిపారు. శ్రీ.కో.

Tags

మొట్టమొదటి సారిగా... టి డికాషన్ ఎవరు తాగారో.. మీకు తెలుసా!

Submitted by arun on Mon, 11/12/2018 - 14:49

మొట్టమొదటి సారిగా... టి డికాషన్...ఎవరు తాగారో.. మీకు తెలుసా! 4వ శతాబ్దంలో చైనా  దేశపు వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే.! శ్రీ.కో.
 

Tags

శ్రీకృష్ణ దేవరాయలు!

Submitted by arun on Mon, 11/12/2018 - 14:42

కొద్దిమంది గొప్ప పాలకులు ... గొప్ప రచయితలు కూడా అయ్యారు.. అలా రచించిన వారు.. శ్రీకృష్ణ దేవరాయలు కూడా.... అయితే...శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ప్రసిద్ధ గ్రంధం ఏదో మీకు తెలుసా? శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ప్రసిద్ధ గ్రంధం ఆముక్త మాల్యద! శ్రీ.కో.

ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర!

Submitted by arun on Mon, 11/12/2018 - 14:36

బిరుదులు పొందటం... ఒక గొప్ప గుర్తింపు.. అలా తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి కొన్ని. కొందరు కవులు, రచయితలు తమ సొంత పేర్లకన్న బిరుదులతోనే విశేష ప్రాచుర్యం పొందినవారూ ఉన్నారు. ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర అనే బిరుదులు పొందిన వ్యక్తి పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు అని మీకు తెలుసా! శ్రీ.కో.

పెళ్ళి పుస్తకం సినిమా

Submitted by arun on Mon, 11/12/2018 - 13:30

పెళ్ళి పుస్తకం ....సినిమా 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం. పెళ్లి .. దానిలో అందచందాలని... బరువు బాధ్యతలని... కోపతాపాలని... చాల చక్కగా చూపిన సినిమా ఇది.. మీరు ఇప్పటివరకు చూడకుంటే మాత్రం.... తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో. 
 

మొట్టమొదటి 3D చిత్రం!

Submitted by arun on Mon, 11/12/2018 - 13:26

మూకి సినిమాల నుండి.. మన సినిమాలు ఎంతో ఎదుగుతూ వచ్చాయి.. అయితే  భారతదేశాములో వచ్చిన మొట్టమొదటి 3D చిత్రం ఏదో మీకు తెలుసా! మొట్టమొదటి 3D చిత్రం అయిన..ఆ సినిమా పేరు  మై డియర్ కుట్టి చేతన్ అనే సినిమా. శ్రీ.కో.
 

సినిమాస్కోప్!

Submitted by arun on Mon, 11/12/2018 - 13:21

సినిమాలో.. టెక్నాలజీ పెరుగుతూ వుంటే… దర్శకులకు తీసే విధానం... ప్రేక్షకులకి చూసే విధానం కూడా మెరుగు అవుతువుంది... అయితే .. బారత దేశంలో...మొట్టమొదటి...సినిమాస్కోప్ ఫిలిం ఏంటో మీకు తెలుసా? బారత దేశంలో...మొట్టమొదటి...సినిమాస్కోప్ ఫిలిం “కగజ్ కే ఫూల్” అనే హింది సినిమా?