Godavari river

ఉగ్రరూపం దాల్చిన గోదారి

Submitted by arun on Sat, 08/18/2018 - 11:37

తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉప నదులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉండటంతో  గోదావరి పరివాహక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలోను ముంచెత్తిన గోదారి  ఏపీలోనూ మహోగ్రరూపం దాల్చింది.  దీంతో ముందస్తుగా అప్రమత్తమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

గోదావరిలో లభ్యమైన నాలుగు మృతదేహాలు

Submitted by arun on Sat, 06/23/2018 - 15:31

పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో నాలుగు మృతదేహాలు లభించాయి. కొవ్వూరు లాంచీల రేవులో ఈ మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు.  వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వీరందరూ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందారా? ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేదేమైన కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్టానిక  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.