Mixture potlam

మనలో దేశబక్తిని పెంచే పాట

Submitted by arun on Wed, 11/14/2018 - 15:04

కొన్ని పాటలు.. మానని ఆహ్లాద పరచడమే కాదు.... మనలో దేశబక్తిని కూడా పెంచుతాయి.. అలాగే ఆలోచింపచేస్తాయి.. అలాంటి పాటే ఈ ...పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయితలు ఆత్రేయ, శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి. రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

కారులో షికారు కెళ్ళే !

Submitted by arun on Wed, 11/14/2018 - 14:35

ఆచార్య ఆత్రేయ గారు.. మనసు కవి మాత్రమే.. కాదు.. మంచి సందేశాత్మక పాటలు కూడా రాసారు.. అలాంటిదే... ఈ కారులో షికారు కెళ్ళే పాట !
కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.
పల్లవి :

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |

నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే

'కృష్ణ' గారు నటించిన తొలి రంగుల చిత్రం!

Submitted by arun on Mon, 11/12/2018 - 16:30

అప్పట్లో.. బ్లాకు అండ్ వైట్ సినిమాల తర్వాత... మెల్లిగా రంగుల చిత్రాలు రావటం మొదలెట్టాయి... అలా సూపర్ స్టార్ 'కృష్ణ' గారు.. కొన్ని సినిమాలు మొదలెట్టారు.. అయితే.. 'కృష్ణ' గారు.. నటించిన తొలి రంగుల చిత్రం ఏదో మీకు తెలుసా!..... 'కృష్ణ' గారు నటించిన తొలి రంగుల చిత్రం తేనె మనసులు. అప్పట్లో బాగా నడిచిన సినిమా.. అలాగే రంగురంగుల అందలను.. వెండి తెరపై చూపిన తెలుగు సినిమా అని చెప్పవచ్చు.  శ్రీ.కో.

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి ఇంటిపేరు

Submitted by arun on Mon, 11/12/2018 - 15:34

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారు అంటే... ప్రస్తుతం.. తెలుగు రాష్టాల్లో.. తెలియని తెలుగు వారు వుండరేమో... అయితే వారి ఇంటిపేరు.. అందరు 'సిరివెన్నెల' అని అనుకుంటారు.. అయితే.. అది వారు రాసిన పాటల సినిమా పేరు మాత్రమే...  .. మీకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి అసలు ఇంటి పేరు ఏమిటో తెలుసా! 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి అసలు ఇంటి పేరు చేంబోలు. వీరు...సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. శ్రీ.కో.

“విధాత తలపున ప్రభవించినది” అనే ఈ పాట!

Submitted by arun on Mon, 11/12/2018 - 15:23

కొన్ని పాటలు.. ఎన్ని సార్లు విన్న... అలా వినాలనిపిస్తాయి... అలాగే.. ఆ రాసిన రచయితని.. ఎంతో పేరుని తీసుకువస్తాయి... అలాంటి పాటే ఈ “విధాత తలపున ప్రభవించినది” అనే ఈ పాట. ఇది  1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలో సుప్రసిద్ధమైనది. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది కె.వి.మహదేవన్.

పల్లవి:

విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం... 

ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...

రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమా!

Submitted by arun on Mon, 11/12/2018 - 15:16

రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమాల్లో... ఒక సినిమాగా.. క్షణక్షణం అని మనం చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారట. ఈ సినిమాలో..మంచి కామెడీ తో పాటు ...

తకిట తదిమి తకిట తదిమి తందాన !

Submitted by arun on Mon, 11/12/2018 - 11:48

కొన్ని పాటలు... ఆడియన్స్ మదిలో ఎప్పటికి నిలిచి పోతాయి...అలా నిలిచిపోయే పాటనే... ఈ తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట... తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట 1983లో విడుదలైన సాగర సంగమం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారింది. దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఇళయరాజా స్వరపరచారు. దీనిలో కమలహాసన్ అద్భుతంగా తన నృత్యంతో అలరించారు. దీనికి దర్శకత్వం కె. విశ్వనాథ్.

తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయలయల జతుల గతుల తిల్లాన ||తకిట||

తడబడు అడుగుల తప్పని తాళాన

వటపత్రశాయికి వరహాల లాలి !

Submitted by arun on Sat, 11/10/2018 - 16:56

వటపత్రశాయికి వరహాల లాలి అనే లాలి పాట... మీరు వినివుంటే... తప్పక లాలి పాటల్లో..అది ఒక గొప్ప పాట అని అంగీకరిస్తారు... ఇది స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట. దీనిని పి.సుశీల మధురంగా గానం చేయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ పాటను రాధిక మీద చిత్రీకరించారు. ఈ రోజుకి.. ఈ పాట వింటున్న...ఎంతో మాదుర్యం వినిపిస్తుంది. 

పల్లవి :

వటపత్ర శాయికి వరహాల లాలి

రాజీవ నేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | |

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |


చరణం 1 :

విజయ్ “సర్కార్” సినిమా రివ్యూ!

Submitted by arun on Fri, 11/09/2018 - 14:47

సర్కార్ సినిమా అనేది ఒక  రాజకీయ ఏత్తు జిత్తుల...సినిమా కథ.  సూపర్ స్టార్ విజయ్ రకరకాల రాజకీయ సమస్యలపై సినిమాటిక్గా తీసిన సినిమా.  అయితే విజయ్ అభిమానులకి ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. విజయ్ తన రెండు భుజాలపై మొత్తం సినిమాని నడిపించాడు అని చెప్పవచ్చు. విజయ్ అభిమానులు ఈ సినిమాను బాగా ఇష్టపడతారు. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎంత నడుస్తుంది అనేది అనుమానమే, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా మిస్సింగ్ అయ్యింది....కాబట్టి, తమిళ ప్రేక్షకులకు నచ్చవచ్చు ... కానీ ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో అంతగా నచ్చక పోవచ్చు.. అయిన... పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది...

అదుగో సినిమా రివ్యూ

Submitted by arun on Fri, 11/09/2018 - 11:25

అదుగో సినిమా రవిబాబు స్టైల్ సినిమా...ఇంతకు ముందు భయపెట్టే సినిమాలు తీస్తే... ఇప్పుడు తను ఎంచుకున్న పంథా కామెడి. ఈ విధానంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.  రక రకాల కథలను ఓ పందిపిల్ల చుట్టూ అల్లుతూ ..తయారు చేసుకున్నాడు..  ఈ “అదుగో” కథ. ఈ సినిమా కోసం..లైవ్‌ 3డీ యానిమేషన్‌లో పందిపిల్ల క్యారెక్టర్‌ తాయారు చేసారు. బడ్జెట్‌ లిమిటెడ్ గా వున్నా క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఇచ్చి అలరించాడనే చెప్పాలి. ప్రశాంత్‌ విహారి అందించిన సంగీతం సినిమాకి కొంత బలాన్ని పెంచిన్దనే చెప్పాలి.  ప్రధానంగా కామెడీతో కసరత్తు చేస్తూ తీసిన సినిమా .. ఇది.