haryana

హర్యానాలో గుర్గావ్ ప్రాంతంలో అలజడి...

Submitted by arun on Thu, 11/08/2018 - 12:54

హర్యానాలో గుర్గావ్ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఓ ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న కారు అగ్నికి ఆహుతయింది.  పూర్తిగా కాలిన కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదాన్ని గ్రహించిన ఆటో డ్రైవర్ ఆటో నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలో దిగి మంటలను ఆర్పివేశారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

భారత బాక్సర్ దీనగాథ.. ఐస్‌క్రీములు అమ్ముకుంటూ…

Submitted by arun on Tue, 10/30/2018 - 13:19

బాక్సింగ్‌లో దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాక్సర్ దినేశ్ కుమార్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. బతుకు తెరువు కోసం కుల్ఫీ ఐస్‌క్రీములు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్న బాక్సర్‌కు ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది కూడా. అర్జున అవార్డు గ్ర‌హీత అయిన అత‌ను త‌న తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు ఐస్ క్రీమ్‌లు అమ్ముతున్నాడు. బాక్స‌ర్ దినేశ్ ఇప్ప‌టి వ‌ర‌కు 17 స్వ‌ర్ణాలు, ఒక సిల్వ‌ర్‌, అయిదు కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్నాడు. అంత‌ర్జాతీయ టోర్నీల‌కు వెళ్లేందుకు..

హర్యానాలో విచిత్రం...పొలంలో వేసిన బోరు నుంచి పొంగుకొస్తున్న పాలు

Submitted by arun on Fri, 10/05/2018 - 12:03

హర్యానాలోని కోయల్ జిల్లాలో ఓ విచిత్రం జరుగుతోంది. సర్దార్ జగ్‌రాత్ సింగ్ పొలంలో ఉన్న బోరు నుంచి పాలు ఉబికి వస్తున్నాయి. నీళ్లు రావాల్సిన చోట పాల ప్రవాహం పొంగుతుండడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు భారీగా తరలివస్తున్నారు. అయితే, అవి పాలుకావని, కలుషిత భూగర్భ జలాలు అయ్యి ఉంటాయని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

Tags

పంజాబ్‌లో పదిరోజుల పాటు రైతుల ఆందోళన

Submitted by arun on Fri, 06/01/2018 - 17:16

ఉత్తర భారతదేశంలో రైతులు రోడ్డెక్కారు. డిమాండ్లను పరిష్కరించాలని పదిరోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలో రైతులు.. నడిరోడ్లపై లీటర్ల కొద్దీ పాలు, కూరగాయలు పారబోశారు. రైతుల సమ్మె సందర్భంగా ఈ నెల 6వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 11 రైతు సంఘాలు చేపట్టిన సమ్మె సందర్భంగా మార్కెట్లకు 10 రోజులపాటు పాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసేదిలేదని రైతులు ప్రకటించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

స్కూల్ ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన స్టూడెంట్

Submitted by arun on Sat, 01/20/2018 - 16:45

హర్యానాలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్‌నే చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని యమునగర్‌లో జరిగింది. యమునగర్‌లో ఉన్న వివేకానంద స్కూల్‌లో 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్ అదే స్కూల్ ప్రిన్సిపల్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

నిర్భయ కంటే దారుణమైన ఘటన..

Submitted by arun on Mon, 01/15/2018 - 11:19

ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. హత్య చేశారు. కురుక్షేత్రలో జనవరి 9న ఓ దళిత బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు జింద్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఉన్న కెనాల్ వద్ద  శవమై తేలింది. బాలిక మృతదేహాన్నిపోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రోహతక్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ముఖం, ఛాతీ, మెడపై బలమైన గాయాలు అయ్యాయి. శరీరంపై 19 గాయాలు ఉన్నట్లు తేలింది. కామాంధులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆధార్‌ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!

Submitted by arun on Sat, 12/30/2017 - 14:20

దేశంలో ప్రతి అంశానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ ఉంటేనే పని అవుతుంది. లేదంటే అంతే. ఆధార్ కార్డు ప్రాణాన్ని బలిగొన్నది అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా జరిగింది. హర్యానాలోని సోనిపట్‌లో ఆధార్ కార్డు లేకపోవడంతో ఓ ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

డేరాబాబాకు వేల కోట్ల ఆస్తులు

Submitted by lakshman on Fri, 09/22/2017 - 18:38
  • బ్యాంకుల్లో రూ. కోట్ల డిపాజిట్లు 
  • 500 ఖాతాలు.. వాటిలో కోట్ల నగదు

సిర్సా: జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు వేల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. వివిధ బ్యాంకుల్లో దాదాపు 500 ఖాతాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్నట్టు తేలింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల నగదు ఉంది. అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు హరియాణా, పంజాబ్‌లలో  విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.