derababa

డేరాబాబాకు వేల కోట్ల ఆస్తులు

Submitted by lakshman on Fri, 09/22/2017 - 18:38
  • బ్యాంకుల్లో రూ. కోట్ల డిపాజిట్లు 
  • 500 ఖాతాలు.. వాటిలో కోట్ల నగదు

సిర్సా: జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు వేల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. వివిధ బ్యాంకుల్లో దాదాపు 500 ఖాతాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్నట్టు తేలింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల నగదు ఉంది. అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు హరియాణా, పంజాబ్‌లలో  విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.