ntr biopic

ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు : వెంకయ్య

Submitted by arun on Thu, 03/29/2018 - 12:33

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్టీఆర్‌....బయోపిక్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్‌లో....ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు షూటింగ్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కు తేజ దర్శకత్వం వహిస్తుండగా...బుర్రా సాయిమాధవ్‌ మాటలు, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్, వారాహి చలనచత్రం, విబ్రీ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయ్. 

ఆ రోజుల్లో నాన్నగారూ.. అంటున్న బాలయ్యా!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:41

అవకాశం వస్తే చాలు. నాన్నగారూ.. అప్పట్లో.. అంటూ.. నందమూరి తారకరామారావు గురించి.. ఆయన పుత్రరత్నం నందమూరి నటసింహం బాలయ్యబాబు.. అభిమానాన్ని కురిపించేస్తూ ఉంటారు. ఎన్ అంటే నటనాలయం.. టీ అంటే తారామండలంలో చంద్రుడు.. ఆర్ అంటే రాజకీయ దురంధరుడు అంటూ తండ్రిని ఆకాశానికెత్తేసే బాలయ్య బాబు.. ఇప్పుడు స్వయంగా అదే ఎన్టీఆర్ పాత్రలో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ విష‌యం లేన‌ట్లేనా

Submitted by arun on Mon, 01/08/2018 - 18:21

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యాక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తుంది. ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ మాట్లాడుతు తాను 62గెట‌ప్పుల్లో క‌నిపిస్తాన‌ని అన్నారు. అంతేకాదు సినిమాల్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అన్నీ అంశాలు తెర‌పై చూపిస్తామ‌ని తెలిపారు. మ‌రి ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీల‌క ఘ‌ట్టాల‌ని చూపిస్తారా లేదా అనేది ప్ర‌శ్నార్ధకంగా మారింది. అంతేకాదు తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని అనేకోణాల్లో  మిత్రులు, శ‌త్రువులు సైతం ఈ బ‌యోపిక్ లో ప్ర‌త్య‌క్ష‌మవుతార‌ని వెల్ల‌డించారు.

62 గెట‌ప్పుల్లో బాల‌కృష్ణ‌

Submitted by arun on Sun, 01/07/2018 - 22:40

తాను 62  గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్నానంటూ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ షాకిచ్చారు. ద‌శావ‌త‌రాం సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్ ప‌ది అవ‌తార‌ల్లో అల‌రించారు. ఇప్పుడు బాల‌య్య  62 పాత్ర‌లు అల‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 62 పాత్ర‌లే అయినా గెట‌ప్ ఒక‌టేన‌ని అంటున్నారు బాలకృష్ణ‌. గ‌త రెండు సంవ్స‌రాల నుంచి బాల‌కృష్ణ డైర‌క్ట‌ర్ తేజ ఎన్టీఆర్ బ‌యోపిక్ లో క‌స‌ర‌త్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో బ‌యోపిక్ గురించి అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పిన బాల‌య్య ఈ సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని అన్నారు. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ : బ‌స‌వ‌తార‌కం పాత్ర కోసం

Submitted by arun on Wed, 01/03/2018 - 12:52

నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస సినిమాలు చేస్తూ నేటి త‌రం హీరోలతో పోటీ ప‌డుతున్నారు. పైసావ‌సూల్, జైసింహాల‌తో బిజీగా ఉన్న బాల‌య్య త్వ‌ర‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యాక్ట్ చేస్తున్నారు.  నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ ఎన్టీఆర్ బయోపిక్ ను తెర‌కెక్కించ‌నున్నాడు. ముందుగా ప్ర‌క‌టించినట్లుగానే ఈ బ‌యోపిక్ లో బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎవరు చేయబోతున్నారు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులోభాగంగా బ‌స‌వ‌తార‌కంగా ఎవ‌రిని తీసుకోవాలో చిత్ర‌యూనిట్ క‌స‌ర‌త్తులు ప్రారంభించింది.

రాంగోపాల్ వర్మ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్సీ

Submitted by lakshman on Fri, 09/22/2017 - 18:08
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం అటు టాలీవుడ్‌తో పాటు, ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి తన సినిమాలో..