ram gopal varma

“శివ” అంటే వీడే !

Submitted by arun on Fri, 11/16/2018 - 14:55

శివ చిత్రం .. తెలుగు సినిమా చరిత్రలోనే... ఒక కొత్త పంథాని నిర్మించిన చిత్రం...ఇది మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.

రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమా!

Submitted by arun on Mon, 11/12/2018 - 15:16

రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమాల్లో... ఒక సినిమాగా.. క్షణక్షణం అని మనం చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారట. ఈ సినిమాలో..మంచి కామెడీ తో పాటు ...

రహస్యంగా షూటింగ్ చేస్తున్న రాంగోపాల్ వర్మ

Submitted by arun on Wed, 10/31/2018 - 14:28

ఒక వైపు నందమూరి బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయో పిక్ పబ్లిక్ గా తీస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా రహస్యంగా  షూట్ చేస్తున్నాడు. జనవరిలో ఎన్టీఆర్ లక్ష్మీస్ సినిమా ఎలాగయిన రిలీజ్ చేయలని  డిసైడ్ చేసుకున్న వర్మ దసరా నుండి షూటంగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే సినిమా షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడో ఎవరికి తెలియటం లేదు కారణం కొంత మంది నుండి వర్మకు గట్టి వార్నింగ్ లే వెళ్ళాయని, అయిన సరే వర్మ పట్టించుకోకుండ షూటింగ్ చేసుకుంటు వెళ్తున్నాడు.

వర్మ బంపర్ ఆఫర్...పట్టుకుంటే లక్ష

Submitted by arun on Sat, 10/13/2018 - 14:54

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రాజెక్ట్‌కి తాజాగా మ‌రోసారి తెర‌పైకి తీసుకొచ్చాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా తీయనున్న మూవీ లాంచింగ్ ఈవెంట్‌ను దసరా (విజయదశమి) రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు వర్మ. జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం...వర్మ ఎంట్రీతో డబుల్ అయిన రచ్చ

Submitted by arun on Thu, 04/19/2018 - 16:26

శ్రీరెడ్డికి టాలీవుడ్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. ఆర్జీవీ రాకతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఈ ఇష్యూలో వర్మ ఎందుకు వేలు పెట్టారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. శ్రీరెడ్డి నిరసనతో మొదలైన చర్చ ఇప్పుడు వర్మ జోక్యంతో పెద్ద రచ్చకే తెరలేపింది.

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

Submitted by arun on Thu, 04/19/2018 - 10:09

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?  

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో కొత్త ట్విస్ట్

Submitted by arun on Wed, 04/04/2018 - 10:20

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో.. కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మళ్లీ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. జీఎస్టీ మూవీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లోనే జరిగినట్లు తాజాగా కంప్లైంట్ రావడంతో.. కేసు కొత్త టర్న్ తీసుకోనుంది.

జీఎస్టీ మూవీలో అసభ్యత, అశ్లీలత ఉందన్న అభియోగాలు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వర్మపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో ఆయనను విచారించి.. సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు, సాక్ష్యాల కోసం వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

వర్మ కెరీర్ కు.. నాగ్ ఫ్యామిలీ ‘ఊపిరి’

Submitted by arun on Thu, 03/29/2018 - 11:33

రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఎవరి మాటా వినని సీతయ్యగా ప్రసిద్ధుడు. కానీ.. యువ సామ్రాట్ నాగార్జున విషయానికి వచ్చే సరికి కామ్ అయిపోతాడు. శివ సక్సెస్ నుంచి ఇద్దరి మధ్యా మాంఛి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అందుకే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. రామ్ గోపాల్ వర్మతో కలిసి ఆఫీసర్ సినిమా చేశాడు.. నాగార్జున. డైరెక్ట్ సినిమాలు లేక.. వెబ్ సిరీస్ లతో కాలం గడిపేస్తున్న వర్మకు.. నాగ్ అవకాశం ఇవ్వడం అంటే.. అది మామూలు విషయం ఏమీ కాదు కదా.

శ్రీదేవిపై వర్మ.. మరోసారి!

Submitted by arun on Sat, 03/03/2018 - 09:30

అందాల తార శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శించుకుంటూనే ఉన్నాడు. వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాను దాటి.. శ్రీదేవిపై తన అభిమానాన్ని సిల్వర్ స్క్రీన్ పై కూడా చూపించే పనిలో వర్మ పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.