Legal notice

రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు

Submitted by arun on Wed, 09/12/2018 - 13:13

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 15రోజుల్లో హాజరుకావాలని రేవంత్ రెడ్డితో పాటు 13మందికి పోలీసులు నోటీసులిచ్చారు. అయితే, ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు రాలేనని రేవంత్ రెడ్డి లేఖను రాశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో.. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు పంపారు.  

శ్రీరెడ్డి ఇష్యూపై నాని భార్య స్పంద‌న‌!

Submitted by arun on Tue, 06/12/2018 - 13:20

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.