AIIMS

ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Submitted by arun on Thu, 08/16/2018 - 14:20

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయి పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో మోదీ నిన్న రాత్రే ఎయిమ్స్ కు చేరుకుని ఆయన్ని పరామర్శించారు. సుమారు 50 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు.

వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల!

Submitted by arun on Thu, 08/16/2018 - 11:40

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. వాజ్‌పేయికి వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. 93 ఏళ్ళ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిదన్న వార్తలతో బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. 

మట్టిలో మాణిక్యం...‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:30

విద్యకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఓ నిరుపేద విద్యార్ధి.. ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంక్ తో పాటు నీట్ లో 803వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ విద్యార్ధి చెత్త ఏరుకునే వ్యక్తి కొడుకు...పేరు ఆశారాం చౌదరి..సొంతూరు మధ్యప్రదేశ్ లోని దేవాన్ గ్రామం. ఎంతో దర్భరమైన పరిస్థితులతో ఆశారం కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. అయినా ఏనాడు కుంగిపోలేదు పట్టుదలతో విద్యలో ముందడుగు వేశాడు. తొలి ప్రయత్నంలోనే అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకుతో పాటు నీట్ లో 803 ర్యాంకును సాధించాడు.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

Submitted by arun on Tue, 06/12/2018 - 12:51

మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ ఆస్పత్రి మెడికల్ అండ్ ప్రోటోకాల్ డివిజన్ చైర్ పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకూ వాజ్‌పేయి ఆస్పత్రిలోనే ఉంటారని ఆయన చెప్పారు. నిన్న ఉదయం వాజ్‌పేయి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు.

ఎయిమ్స్‌లో చేరిన మాజీ పీఎం వాజ్‌పేయి

Submitted by arun on Mon, 06/11/2018 - 14:28

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వాజ్‌పేయిని తరలించినట్లు బీజేపీ ప్రకటించింది. ఎయిమ్స్‌ సంచాలకులు రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వాజ్‌పేయికు వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు వాజ్‌పేయి. బీజేపీ చెందిన ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు.