Kaala

తెలుగు రాష్ట్రాల్లో ‘కాలా’ఫస్ట్ డే కలెక్షన్స్ !

Submitted by arun on Sat, 06/09/2018 - 13:27

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుని పూర్తిస్థాయి విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం చెన్నై మహానగరంలో కలెక్షన్లపరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కరికాలన్ దెబ్బకు గతంలో విడుద‌లైన త‌మిళ సినిమా రికార్డుల‌న్నీ బద్ధలైపోయాయి. సుమారు రెండేళ్లుగా తలైవా మూవీ కోసం ఎదురు చూస్తున్న చెన్నై ఫ్యాన్స్ ‘కాలా’ కళ్లుచెదిరే రికార్డ్‌ను అందించారు. చెన్నై సిటీలో తొలిరోజు రూ. 1.76 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ దలపతి విజయ్ ‘మెర్సల్’ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. మెర్సల్ మూవీ చెన్నై సిటీలో తొలిరోజు రూ.

కాలా మూవీలో నటించిన కుక్కకు భారీ డిమాండ్

Submitted by arun on Fri, 06/08/2018 - 12:25

కాలా సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో రజినీకాంత్‌ యాక్షన్‌కు జనం ఫిదా అవుతున్నారు. సినిమాలో కాలా పక్కన నటించిన కుక్క...రాత్రిరాత్రికే స్టార్‌ డమ్ సంపాదించుకుంది. మూవీలో మనీ అనే కుక్కతో జనం ఫోటోలు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. రజినీకాంత్‌తో పాటు మనీ అనే కుక్క సింగిల్‌ టేక్‌లో సీన్లను చేసినట్లు యజమాని తెలిపారు. మూవీలో నటించిన తర్వాత మనీని 2 కోట్లకు కోనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందుకు వచ్చారు. అయితే దాని యజమాని మాత్రం కుక్కను అమ్మే ప్రసక్తే లేదని చెబుతున్నారు. 

కర్నాటకలో కాలా మూవీ విడుదలకు లైన్ క్లియర్

Submitted by arun on Tue, 06/05/2018 - 16:40

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీ కర్ణాటకలో విడుదలకు లైన్‌ క్లియరైంది. సినిమా విడుదలకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. కావేరీ జలాలను తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాలంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ అనుకూల సంస్థలు కాలా విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో కాలా మూవీ విడుదలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ...ఎలాంటి అవాంచనాలు కలకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.