GVL Narasimha Rao

గవర్నర్‌ నరసింహన్‌తో జీవీఎల్ భేటీ

Submitted by chandram on Sun, 11/11/2018 - 12:35

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించారు. నిత్యం బీద అరుపులు అరిచే చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు సొంత డబ్బుతో ఎన్ని పర్యటనలు చేసినా తమకు అభ్యంతరం లేదన్న ఆయన పరిస్ధితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రకటించారు. 
 

బచ్చా చిటికేస్తే బాబు ఢిల్లీకి వెళ్లడమేంటి?: ఎంపీ జీవీఎల్

Submitted by arun on Thu, 11/01/2018 - 12:41

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్‌ డైపర్లు వేసుకునే వాడని అన్నారు. అలాంటి బచ్చా అఖిలేష్‌ చిటికేస్తే ఢిల్లీ వెళ్లడం సిగ్గనిపించడం లేదా అంటూ జీవీఎల్‌ చంద్రబాబును ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చడం కాదా అంటూ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు. 
 

టీడీపీ శని మమ్మల్ని వదిలి కాంగ్రెస్‌ను పట్టింది

Submitted by arun on Thu, 10/04/2018 - 16:18

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌  ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే ప్రచారం చేయాలంటూ సూచించారు. కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌‌కు  తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ అన్నారు. పోటీపడి అబద్దాలు చెబుతూ, అవినీతికి పాల్పడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలకు త్వరలోనే గుణపాఠం చెబుతామన్నారు. తమ నుంచి టీడీపీ వెళ్లిపోవడంతో  బీజేపీకి పట్టిన శని పోయిందన్న ఆయన ఇప్పుడు ఆ శని కాంగ్రెస్‌కు తగిలిందన్నారు. 

పీడీ అకౌంట్స్‌లో అవినీతిని వెలికితీసే దాకా వదలం: జీవీల్ నరసింహారావు

Submitted by arun on Thu, 08/23/2018 - 12:33

గవర్నర్ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఏపీ సర్కార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు పీడీ అకౌంట్స్‌‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పీడీ అకౌంట్స్ తెరిచారని, 53వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని చెప్పారు. పీడీ అకౌంట్స్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో సహా అందరూ అబద్దాలు చెబుతున్నారని, సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధపడాలని సూచించారు. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేసి కొత్త స్కామ్‌కు ప్రభుత్వం తెరతీసిందని, టెండర్లలో ప్రభుత్వ రంగ  సంస్థలు ఎందుకు పాల్గొనకూడదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. 

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయ్ : బీజేపీ

Submitted by arun on Tue, 07/24/2018 - 17:18

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీకి న్యాయం జరగలేదని బీజేపీతోనే ఏపీ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రధాని ఇచ్చిన చాలా హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న జీవీఎల్‌ ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారన్న ఆయన చేతనైనంత సాయం కేంద్రం చేస్తోందన్నారు. 
 

జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై లోకేశ్ కౌంటర్

Submitted by arun on Tue, 06/05/2018 - 13:41

బీజేపీ నాయకుడు.. జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. యూసీలు సరిగ్గా లేవని చెప్పడానికి ఆయన ఎవరంటూ ట్వీట్ చేశారు. ఒకవేళ యూసీలు సరిగ్గా లేకపోతే.. కేంద్రంలోని సంబంధిత శాఖలు చూసుకుంటాయని.. తెలిపారు. అయితే ఆయా శాఖలన్నీ రాష్ట్రం పంపించిన యూసీలను ఆమోదించాయని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందన్న లోకేశ్.. ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి నెరవేర్చేందుకు యూసీలు అవసరమా అని.. లోకేశ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.