guntur

కోటప్పకొండ లో అంగరంగ వైభవంగా కార్తీక మాసం

Submitted by arun on Thu, 11/08/2018 - 12:26

గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన  కోటప్పకొండపై కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి  త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాశివుడికి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కార్తీక దీపాలను వెలిగించారు. భారీగా తరలివచ్చిన  భక్త జనులతో  క్షేత్రం కిటకిటలాడుతుంది. 

గుంటూరులో జనతా గ్యారేజ్‌!

Submitted by arun on Tue, 11/06/2018 - 08:57

జనతా గ్యారేజ్‌ ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును ఇదీ జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌. సామాన్యులకు ఏ సమస్య వచ్చినా జనతా గ్యారేజ్‌‌కు వెళ్లి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్నట్లు ఆ సినిమాలో చూపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు గుంటూరు జిల్లాలో కత్తితో వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై కత్తితో సినిమా సీన్‌ చూపించాడు. ఓ చేత కత్తి పట్టుకొని మరో చేతిలో సెల్‌ఫోన్‌‌లో మాట్లాడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు.

మాచర్లలో.. అత్తాపూర్‌ లాంటి ఘటన

Submitted by arun on Mon, 10/01/2018 - 18:02

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నడిరోడ్డుపై జరిగిన ఘోర హత్య మరువకముందే అలాంటి మరో ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. మాచర్లలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. బార్ లో మద్యం సేవించి బయటకు వస్తున్న యువకుడిని బయట కాపుకాసి ఉన్న నలుగురు వ్యక్తులు, ఒక్కసారిగా ఎటాక్ చేసి కత్తులతో నరికి చంపారు. మృతుడు చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గా గుర్తించారు. ఓ మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రేమ్ కుమార్ తన భార్యను కలిసేందుకు వచ్చాడు. ఈ విషయం తెలియడంతో బులెట్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెంబడించిన దుండగులు దాడి చేసి చంపారు. 

పండగపూట పెను విషాదం

Submitted by arun on Thu, 09/13/2018 - 13:03

గుంటూరు జిల్లాలో వినాయక చవితి పండుగపూట విషాదం నెలకొంది. ప్రత్తిపాడు మండలం గనికపూడిలో వినాయక మండపం దగ్గర కరెంటు తీగ తగిలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి..కూతురు, కొడుకు ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన గనికపూడిలో విషాదాన్ని నింపింది.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గనికపూడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

దారుణం... ప్రియురాలిపై అత్యాచారం చేస్తుంటే పారిపోయిన ప్రియుడు!

Submitted by arun on Mon, 07/02/2018 - 14:47

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా చూసినా.. చెడుగా మాట్లాడినా చెంప చెళ్లుమనిపిస్తాడు ప్రియుడు. కానీ తన కళ్లేదుట ప్రియురాలిని బలవంతం చేయబోతే అతని రక్తం మరగాల్సి చోట ఆమెను వారికి అప్పగించి పారిపోయాడు ఓ పిరికి ప్రేమికుడు. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో దర్యాప్తు జరిపిన పోలీసులకు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

పెనుమాక దొంగ.. కోడలే

Submitted by arun on Sat, 06/16/2018 - 12:01

గుంటూరు జిల్లా పెనుమాకలో సంచలనం సృష్టించిన చోరీ కేసును 24 గంటల్లో  పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగలే ఇంటికి కన్నం వేసేందుకు కుట్ర పన్నారు. భూమి అమ్మిన డబ్బులు తనకు దక్కకపోవడంతో కోడలే ఈ దొంగతనానికి పథకం పన్నింది. అత్తపై దాడి చేయించి, వింత నాటకం ఆడింది. తమదైన శైలిలో కేసును విచారించిన పోలీసులు డ్రామా కోడలితో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 55 లక్షల 20 వేల నగదు, 210 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు. 

విషాదం...ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Submitted by arun on Fri, 06/01/2018 - 12:33

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అర్బన్‌ సీఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన బొనిగెల శారద(34) తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా పొన్నూరులోని 31వ వార్డులో నివాసం ఉంటోంది. గురువారం అర్థరాత్రి తనతో పాటు తన పిల్లలపై వంటనూనె, డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

టీడీపీ నేత‌లు ఏపీని అవినీతి ఆంధ్రాగా మార్చారు

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:10

ఇక‌పై టీడీపీ వైఫల్యాన్ని ఎండ‌గ‌తాం అంటూ ఏపీ ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. గాలిజ‌నార్ధ‌న్ రెడ్డి అవినీతి ప‌రుడైతే మీరు ఇసుక మాఫీయాను ఎందుకు అరిక‌ట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ నేత‌లు ఏపీని అవినీతి ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక స్కీం కింద పేద‌ల‌కు లారీ ట్ర‌క్కు ఇసుక ఫ్రీగా పంపిణీ చేస్తామ‌ని ..రూ.15వేలు వ‌సూలు చేశార‌ని సూచించారు. అదేమంటే ఇసుక‌మాఫీ ఆట‌క‌ట్టించిన ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి చేస్తారా..? ఇసుక మాఫీయాలో హ‌స్తం ఉన్న ఎమ్మెల్యేకి వ‌త్తాసు ప‌లుకుతారా..? అని మండిప‌డ్డారు. మీ అవినీతి 

మార్చి 14.. ప‌వ‌న్ ఏం చేయ‌బోతోన్నారు.. ?

Submitted by lakshman on Sat, 03/10/2018 - 20:48

జ‌నసేన పార్టీ ఆవిర్భావ స‌భ‌ను అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ స్థాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ వేదిక‌పైనే పార్టీ విధివిధానాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది రాజ‌కీయ నిర్వాసితులు జ‌న‌సేనలోకి వెళ్లే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీ ఆవిర్భావ స‌భ ఏర్పాట్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ను కాంగ్రెస్ నుంచి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న మాదాసు గంగాద‌ర్ కు అప్ప‌గించారు ప‌వ‌న్. 

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం

Submitted by arun on Sat, 02/24/2018 - 10:49

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. క్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్‌, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.