Thoothukudi

నటించింది చాలు ! ఇక ఆపు !

Submitted by arun on Thu, 05/24/2018 - 13:49

తమిళనాడు తూత్తుకుడిలో గురువారం మళ్ళీ ఉద్రిక్తత తలెత్తింది. స్టెరిలైట్ రాగి ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కాల్పుల్లో గాయపడిన 22 ఏళ్ళ కలియప్పన్ అనే వ్యక్తి కిందపడిపోయి బాధతో విలవిలలాడుతుండగా..అతడ్ని ఆసుపత్రికి తరలించాల్సిన పోలీసుల్లో ఒకరు.. ‘ నటించింది చాలు..ఇక ఆపు ..’ అంటూ కసురుకున్నాడు. స్థానిక రిపోర్టర్ ఒకరు దీన్ని వీడియో తీశాడు. కలియప్పన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు.

డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అరెస్ట్‌..

Submitted by arun on Thu, 05/24/2018 - 13:32

తమిళనాడులో డీఎంకే  నేతలు చేపట్టిన సిఎం కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.  స్టెరిలైట్ ఘటను నిరసనగా డీఎంకే  వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్టాలిన్ ను అరెస్ట్ చేశారు. స్టాలిన్ తో పాటు డీఎంకే  కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్టాలిన్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఈనిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు పోలీసు కాల్పుల్లో 12 మంది మరణించిన ఇంకా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

నివురుగప్పిన నిప్పులా తూత్తుకుడి..

Submitted by arun on Thu, 05/24/2018 - 10:57

తూత్తుకూడిలో జరిగిన హింసాత్మక సంఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్, డిజిపి టికె రాజేంద్రన్ లకు  నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 2 వారాల్లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఘటనలో గాయపడిన వారికి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారనే విషయం కూడా తెలిపాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది. హింసాత్మక సంఘటనలు జరుగుతాయనే విషయాన్ని అధికారులు ముందుగా అంచనావేయలేకపోయారని మానవ హక్కుల సంఘం పేర్కొంది.