hd kumaraswamy

కర్ణాటక ప్రజలకు సీఎం కుమారస్వామి తొలిషాక్!

Submitted by arun on Thu, 07/05/2018 - 17:27

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కర్ణాటక సీఎం కుమారస్వామి అక్కడి ప్రజలకు తొలి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను భారాలను మోపారు. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నును 30 నుంచి 32 శాతానికి, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 1.14, డీజిల్‌ రూ 1.12 మేర పెరగుతాయని చెప్పారు.

కుమారస్వామి సంచలన నిర్ణయం... మోదీ బాటలో...!

Submitted by arun on Sat, 06/02/2018 - 11:34

అధికారిక సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరూ ఫోన్లను వినియోగించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. మీటింగ్ లు జరుగున్నప్పుడు కొందరు అధికారులు ఫోన్లను చూస్తున్నారని... దీనివల్ల చర్చలకు ఇబ్బంది కలుగుతోందని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు ఫోన్లను తీసుకురాకూడదని తెలిపారు. సమావేశం ముగిసేంత వరకు ఫోన్లను కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. తన సమావేశాలకు అధికారులెవరూ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు.

పంతం నెగ్గించుకున్న జేడీఎస్‌

Submitted by arun on Thu, 05/31/2018 - 15:36

కర్నాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య మంత్రి పదవుల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు హోంశాఖ ఇచ్చేందుకు అంగీకరించిన కుమారస్వామి .. కీలకమైన  హోంశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థికశాఖను సీఎం కుమారస్వామి తీసుకోనుండగా, హోం శాఖ కోసం కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌తో పాటు మరి కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఆర్థిక శాఖ జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు రానున్నట్లు తేలింది. ఈ రోజు సాయంత్రం కర్ణాటక మంత్రివర్గంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మిగతా శాఖల బాధ్యతలు ఎవరెవరు చేపట్టనున్నారన్న విషయాన్ని వెల్లడించి, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 

కర్నాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 05/29/2018 - 10:54

కర్నాటక ప్రజలు జేడీఎస్‌‌కు అధికారమివ్వలేదు.... కాంగ్రెస్‌ దయవల్లే ముఖ్యమంత్రినయ్యా.... ఎవరేమనుకున్నా కాంగ్రెస్‌ ఏం చేబితే అదే చేస్తానంటూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కన్నడనాట సంచలనంగా మారాయి. ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానంటూ ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.... కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లే నడుచుకుంటాననడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

బలపరీక్షలో కుమారస్వామి ఘన విజయం

Submitted by arun on Fri, 05/25/2018 - 15:57

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించారు. బలపరీక్షకు ముందు బీజేపీ సభను వాకౌట్ చేసింది. దీంతో సభలో కాంగ్రెస్‌, జేడీఎస్‌, ఇండిపెండెంట్ సభ్యులు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ వాకౌట్‌ తర్వాత జరిగిన బలపరీక్షలో కుమారస్వామికి 117 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రిగా కుమారస్వామి బలం నిరూపించుకొని...సత్తా చాటుకున్నారు. 

బలపరీక్షకు ముందే కుమారస్వామి గెలుపు

Submitted by arun on Fri, 05/25/2018 - 12:54

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి వుండగా బీజేపీ వెనక్కు తగ్గింది. ఆ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకునేంత సంఖ్యా బలం తమ వద్ద లేదని భావించడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

నేడే కుమార స్వామికి అగ్నిపరీక్ష

Submitted by arun on Fri, 05/25/2018 - 10:22

కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష  ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభం కానున్న విధాన సభలో కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోనుండగా.. స్పీకర్ పదవికోసం కాంగ్రెస్, జేడీఎస్ పోటీపడుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత సీఎం కుమారస్వామి  విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అయితే, కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్‌- జేడీఎస్‌ల కూటమి బల పరీక్ష జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం

Submitted by arun on Wed, 05/23/2018 - 16:48

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి.. 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా కుమారస్వామి, పరమేశ్వరతో ప్రమాణ స్వీకారం చేయించారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు.