karnataka assembly

నేడే కుమార స్వామికి అగ్నిపరీక్ష

Submitted by arun on Fri, 05/25/2018 - 10:22

కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష  ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభం కానున్న విధాన సభలో కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోనుండగా.. స్పీకర్ పదవికోసం కాంగ్రెస్, జేడీఎస్ పోటీపడుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత సీఎం కుమారస్వామి  విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అయితే, కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్‌- జేడీఎస్‌ల కూటమి బల పరీక్ష జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరు ఎవరు?

Submitted by santosh on Sun, 05/20/2018 - 18:11

కర్ణాటక రాజకీయం చివరి క్షణం దాకా తీవ్ర ఉత్కంఠగా సాగింది. బీజేపీ ఆడిన మైండ్ గేమ్‌.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిని కలవరపెట్టింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే మద్దతు మాకు ఉందని, బలనిరూపణ చేసుకుంటామని చెప్పి గందరగోళం సృష్టించారు. ఓ వైపు బేరసారాల ఆడియోలు విడుదల కావడం, మరోవైపు సభకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఆఖరి క్షణాల్లో ఆ ఇద్దరు అసెంబ్లీలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఊపిరి పీల్చుకుంది. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ బీజేపీ గాలంలో చిక్కుకున్నట్టు ప్రచారం జరిగింది.