lovers

ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో బీటెక్ యువతికి పరిచయం.. చివరికి..

Submitted by arun on Wed, 08/15/2018 - 12:13

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. కృష్ణా జిల్లా టైలర్‌పేటకు చెందిన  ఆటోడ్రైవర్  దారా ఫృద్వీరాజుకు  వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని కొత్తూరులంక సాయిదివ్యతో ఐదు మాసాల క్రితం పరిచయం ఏర్పడింది. ఏలూరు నుండి ప్రతి రోజూ  సాయిదివ్య విజయవాడకు గ్రూప్-2 కోచింగ్‌కు వస్తూండేది. దీంతో బస్టాండ్‌లో  ఫృద్వీరాజ్‌తో సాయిదివ్యతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 9వ తేదీ నుండి సాయిదివ్వ కన్పించకుండా పోయింది.

Tags

ప్రేమజంటపై జవాన్ దాడి...అత్యాచారయత్నం

Submitted by arun on Wed, 07/25/2018 - 16:32

హైదరాబాద్‌లో ఓ జవాను ప్రేమ జంటపై దాడి చేశాడు. అంతేకాదు యువతిపై అత్యాచార యత్నం చేశాడు. హైదరాబాద్ అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మొన్న సాయంత్రం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఓ ప్రేమ జంట అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన జవాన్ ఆ యువకుడిపై దాడి చేశాడు. దీంతో అతను పారిపోగా యువతిపై అత్యాచార యత్నం చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడే గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ బాధితురాలి అరుపులు విని అక్కడికి వచ్చాడు. జవానుని పట్టుకోబోగా అతను కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయే యత్నంచేశాడు.

దేశ రాజధానిలో మరో దారుణం

Submitted by arun on Tue, 07/24/2018 - 12:37

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన  పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఓ పోకిరీ యువతితో బలవంతంగా సెల్పీ కూడా దిగాడు. ప్రేమ జంటపై పోకిరీల వేధింపుల వీడియో వైరల్  కావడంతో పోలీసులు స్పందించారు. ప్రేమ జంటను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

ప్రియుడుతో ఉన్న భార్యను చూసి భర్త ఏంచేశాడంటే...

Submitted by arun on Wed, 07/04/2018 - 16:09

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కొల్లమిట్టలో దారుణం జరిగింది. భార్యను, ఆమె ప్రియుడిని.. భర్త సజీవదహనం చేసేశాడు. భార్య ప్రియుడితో కలిసి ఉండటం చూసి భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్య చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక..తాళం వేసి ఏకంగా ఇంటిని తగలబెట్టేశాడు. మంటల్లో చిక్కుకొని.. భార్య కవిత, ప్రియుడు శ్రీను సజీవదహనం అయ్యారు. భార్య తరఫు బంధువులు.. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Tags

ఉరేసుకున్న ప్రేమికులు...కలకలం సృష్టిస్తున్న మృతదేహాలు

Submitted by arun on Thu, 06/28/2018 - 12:29

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై రెండు ఆస్తిపంజరాలను పోలీసులు గుర్తించారు. ఆధారాలను బట్టి వీరు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పెద్దండి ప్రశాంత్‌, గౌతమిగా నిర్ధారించారు. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవటంతో వీరిద్దరూ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రశాంత్, గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లి జరిపించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా గౌతమికి మరొకరితో వివాహం నిశ్చయించారు. విడిపోయి జీవించడం కన్నా చనిపోవడం మంచిందని ప్రేమికులు భావించారు.

పెళ్లి చూపులకొచ్చి బిడ్డ తల్లితో యువకుడు పరార్

Submitted by arun on Fri, 06/01/2018 - 12:36

పెళ్లి సంబంధం కోసం పెళ్లి చూపులకు వచ్చిన ఓ యువకుడు పెళ్లైన ఆమె అక్కతో ఉడాయించిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

ప్రేమ పెళ్లితో క‌ష్టాలు ప్రారంభం

Submitted by arun on Sat, 01/27/2018 - 11:44

వారిద్దరూ మేజర్లు...ఒకరిపై ఒకరు మనసుపడ్డారు...8ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి రెండు కుటుంబాలు విలన్లుగా మారాయ్. దీంతో చేసేదేమీ లేక ప్రేమికులిద్దరూ నిన్న రామంతాపూర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

మా ప్రేమ‌ను బ్ర‌తికించండి

Submitted by arun on Wed, 01/24/2018 - 12:35

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి కాపురం చేయాలనుకున్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఒకటవ్వాలనుకొని తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో గుట్టుగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా భావించిన పిల్ల తరఫువాళ్లు తాము మారినట్టు మాయమాటలు చెప్పి రప్పించారు. అబ్బాయిని నడిరోడ్డు మీద చితకబాది అమ్మాయిని దాచేశారు. చావుదెబ్బలు తిన్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన భార్యను తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాడు.

రెండు ప్రాణాలను బలితీసుకున్న ప్రేమ

Submitted by arun on Fri, 01/19/2018 - 15:52

ప్రేమ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కలిసి బతకలేమనుకొన్న జంట ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో కన్నవారి ఆశలను కలలు చేసి తనువు చాలించుకున్నారు. ఆనందాన్ని పంచాల్సిన పిల్లలు విషాదాన్ని నింపి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగింది.
 

ప్రేమికులు దొంగ‌లుగా మారారు

Submitted by arun on Tue, 12/19/2017 - 13:44

 

హైదరాబాద్‌ పంజాగుట్టలోని లలిత జ్యువెలర్స్‌ సంస్థలో జరిగిన చోరీని పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. చోరీ కేసులో ఇద్దరు ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాప్‌లో దోచుకున్న బంగారు ఆభరణాలను ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి అనే ప్రేమికులు బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్‌ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్‌ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.