farmers

కష్టపడి పంట పండించే అన్నదాతలు సంతోషంగా లేరు : మోడీ

Submitted by arun on Wed, 08/15/2018 - 15:58

అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందన్నారు ప్రధాని మోడీ అన్నారు యావత్‌ దేశం విశ్వాసంతో తొణకిసలాడుతోందని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. నాలుగేళ్ళ ఎన్డీఏ పాలన గురించి ఎర్రకోటపై వల్లె వేసిన మోడీ తాము రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయబోమని దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఉగ్రరూపం దాల్చిన ఆయకట్టు రైతుల ఆందోళనలు

Submitted by arun on Mon, 08/06/2018 - 17:42

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్సీ దగ్గర ప్రశాంతంగా ఉన్నా పరిసర గ్రామాల్లో మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుతోపాటు ఆయకట్టు గ్రామాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. 
          

Tags

మంత్రాలకు పంటలు

Submitted by arun on Sat, 07/28/2018 - 13:45

పంటలకు ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించకుండా కాస్మిక్‌ ఎనర్జీ ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని సురేశ్‌ చంద్ర, శ్రీమతి నయన్‌లు తెలిపారు. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు మూడు యూనివర్శిటీలు కాస్మిక్ ఎనర్జీ పద్దతిపై అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేశాయని సురేశ్‌ చంద్ర, నయన్‌లు చెప్పారు. ప్రాచీన శివయోగ పరంపరలో నిష్ణాతులైన బాబా శివనంద్‌ జీ నుంచి అరగంటసేపు దీక్ష తీసుకున్న రైతులు తమ పొలానికి ప్రాణశక్తిని సూర్యుడి ద్వారా జీవితాంతం, ఎన్ని ఎకరాల పొలానికైనా కాశ్మిక్ ఎనర్జీని ప్రసరింపజేయగలరని తెలిపారు. 

అన్నదాతకు రూపాయికి రూపాయిన్నర మద్దతు

Submitted by arun on Thu, 07/05/2018 - 13:29

అన్నదాతకు మద్దత్తు ధరలు,

పెట్టుబడి ఇక తిరిగి దొరులు,

కరుణించినవి కేంద్ర సిరులు,

ఇక తొలుగునా రైతన్న కన్నీటి పొరలు. శ్రీ.కో

10 రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్

Submitted by arun on Wed, 06/06/2018 - 18:50

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైతుల మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంగా జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. 

ఆగస్టు 15 నుంచి తెలంగాణలో రైతు బీమా పథకం

Submitted by arun on Mon, 06/04/2018 - 17:10

రైతు బీమా పథకం.. తాను చేసిన గొప్పపని అన్నారు సీఎం కేసీఆర్‌. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలవుతుందని చెప్పారు. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లోనే బాధిత కుటుంబానికి.. 5 లక్షల బీమా అందుతుందన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

రైతు బీమా.... నా జీవితంలో నేను చేసిన గొప్పపని : సీఎం కేసీఆర్‌

Submitted by arun on Mon, 06/04/2018 - 13:25

రైతు బీమా పథకం... తన జీవితంలోనే గొప్పపని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ... రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీ సంస్థతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

రైతుల కలలు నిజం చేస్తున్నాం : కేసీఆర్

Submitted by arun on Sat, 06/02/2018 - 12:28

సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నో అడ్డంకులను అధిగమించి....ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలు చేశామని స్పష్టం చేశారు. ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్న ఆయన...దశల వారీగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

తెలంగాణ రైతులకు శుభవార్త...పంట సాయం చెక్కుల పంపిణీ తేదీ ఖరారు

Submitted by arun on Wed, 04/18/2018 - 10:39

తెలంగాణ రైతులకు శుభవార్త..రైతులకు పంట సాయం అందించే చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది. రైతు బంధు పథకం కింద రైతులకు చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి కూడా అదే రోజు శ్రీకారం చుడతారు. 

చీమలదండులా కదిలిన ఎర్రదండు

Submitted by arun on Fri, 03/09/2018 - 11:23

చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. పోరు బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 30 వేలకు పైగా అన్నదాతలు పాల్గొంటున్నారు.