prabhas

కాపీ రైట్స్ వివాదంలో ‘సాహో’.. ?

Submitted by lakshman on Tue, 01/09/2018 - 11:29

బాహుబలి సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో సాహో సినిమా గురించి రూమ‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. టీ సిరీస్ కు చెందిన లార్గో విన్చ్ సినిమా వివాదం అజ్ఞాత‌వాసిని చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. త‌న సినిమాను డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాపీ కొట్టార‌ని..రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించాలని టీ సిరీస్ కోర్టుకెక్కింది. దీంతో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో వివాదం క‌రెక్ట్ కాద‌ని భావించిన కొంత‌మొత్తం చెల్లించి ఆ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఇదిలా ఉంటే లార్గోవిన్చ్ వివాదం ‘సాహో’ను కూడా ఇర‌ట‌కాటంలో పెట్టిన‌ట్లు టాక్.

పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

Submitted by arun on Wed, 01/03/2018 - 12:42

ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారంపై రోజుకో రూమ‌ర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో భీమ‌వ‌రానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటార‌ని వార్త‌లు రాగా..అదేంలేద‌ని పెద్ద‌నాన్న కృష్ణంరాజు కొట్టిపారేశారు. ఆ త‌రువాత‌ హీరోయిన్ అనుష్క‌ను వివాహం చేసుకుంటార‌ని ఇలాపుకారు షికార్లు చేశాయి. ఈనేప‌థ్యంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్క‌ను ప్రేమిస్తున్నార‌నే  ఓ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో  ఒకే జంట వ‌రుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమ‌ర్లు రావ‌డం కామ‌న్ అని అన్నారు.

అతి త్వరలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

Submitted by arun on Tue, 01/02/2018 - 17:59

రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కొత్తకాలంగా చర్చ నడుస్తోంది. కానీ అది ఇన్ని రోజులు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయింది. అయితే అది ఎట్టకేలకు నిజం కాబోతోంది. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే తెలియజేశాడు.అది కూడా సాహో మూవీ తర్వాత.

కృష్ణంరాజు తో కలిసి ప్రభాస్ దందా

Submitted by arun on Tue, 01/02/2018 - 13:58

రెబల్ స్టార్ ప్రభాస్ దందా మొదలుపెట్టబోతున్నాడా..?అది కూడా పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి. దందా అంటే ఏదో కొత్త వ్యాపారం అనుకుంటే పొరపాటే ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పేరే దందా. ప్రస్తుతం సాహో మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్.  నెక్ట్స్ దందా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అందులో స్వీటీ ముందుంటుంది: ప్రభాస్

Submitted by arun on Wed, 12/20/2017 - 15:35

అనుష్క (స్వీటీ) నటించిన 'భాగమతి' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. థ్రిల్లింగ్ విజువల్స్ తో రూపొందించిన భాగమతి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినీ ప్రముఖులు అనుష్క పాత్రల ఎంపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. అనుష్కపై ప్రశంసలు కురిపించాడు. "ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే ఉంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతోపాటు 'భాగమతి' టీజర్ ను కూడా అప్ లోడ్ చేశాడు.


 

'మ‌హానుభావుడు'కి ప్ర‌భాస్ అతిథి

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 21:09

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 'మ‌హానుభావుడు'. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి2' చిత్రాల క‌థానాయ‌కుడు, రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భాస్‌తో 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

పోలీస్ పాత్రలో శ్ర‌ద్ధా క‌పూర్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 16:57

'ఆషిఖీ 2' చూసిన వారెవ‌రైనా ఆ చిత్ర క‌థానాయిక శ్ర‌ద్ధా క‌పూర్ న‌ట‌న‌కి, గ్లామ‌ర్‌కి ఫిదా అవ్వాల్సిందే. అంత‌గా ఆ సినిమాలో మెప్పించింది శ్ర‌ద్ధా. ఆ త‌రువాత మ‌రికొన్ని హిట్ చిత్రాల్లో మెరిసిన ఈ చిన్న‌ది.. తొలిసారిగా ఓ ద‌క్షిణాది చిత్రం చేస్తోంది. అదే ప్ర‌భాస్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రం 'సాహో'. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

50 సంవ‌త్స‌రాల క్రితం క‌థ‌తో ప్ర‌భాస్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 15:34

'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' చిత్రాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'సాహో' అనే త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, నీల్ నితేష్ ముఖ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, లాల్ వంటి భారీ తారాగ‌ణంతో తెలుగు, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతోంది.