kcr

బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం: రాహుల్

Submitted by chandram on Mon, 12/03/2018 - 15:33

తెలంగాణను కేసీఆర్‌ అప్పుల్లో ముంచారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గద్వాల్‌లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం బంగారు తెలంగాణ కోసం నీళ్లు, నియామకాలు, నిధులు వస్తాయని ప్రజలు కలకన్నారని కాని బంగారు కుటుంబం మాత్రమే వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లగా ప్రజల కలలు కల్లలయ్యాయి అని విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో వేల కోట్లను దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంటే కావో కమీషన్‌ రావ్‌’’ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ...

Submitted by chandram on Sun, 12/02/2018 - 12:03

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికగా టీఆర్ఎస్ మరోసారి బలాన్ని ప్రదర్శించబోతోంది. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌‌లో టీఆర్ఎస్ సభకు నిన్న మధ్యాహ్నం అనుమతి రావడంతో నేతలు హడావిడిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్ది గంటల సమయంలోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌ సభావేదికగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. కేసీఆర్ మరిన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తారని అంచనా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తారు.

తనను ప్రశ్నించడం వెనక పెద్ద వ్యూహం ఉందంటున్న కేసీఆర్

Submitted by arun on Sat, 12/01/2018 - 10:45

వరుస బహిరంగ సభలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించిన గులాబి బాస్ ఈ రోజు ప్రచారానికి విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు తాను పర్యటించిన నియోజకవర్గాల్లో అభ్యర్ధులు గెలుపు అవకాశాలు,మేనిఫేస్టో విడుదల ఇతర అంశాలపై ఆయన నేడు చర్చించనున్నారు. ఇతర పార్టీలకు ధీటుగా ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫేస్టో రూపకల్పనకు మెరుగులు దిద్దినట్టు వార్తలు వస్తూ ఉండటంతో గులాబి అధినేత కురిపించే వాగ్ధానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అవినీతి ఆరోపణలు...ఆ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే...

Submitted by arun on Sat, 12/01/2018 - 09:54

కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు పాత వివాదాలను తవ్వి తీస్తున్నారు. అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్‌కు ఏకకాలంలో చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. కారు, కమలం వేర్వేరు కాదంటూ ఇప్పటి వరకు ప్రచారం చేసిన హస్తం నేతలు తాజాగా కుమ్మక్కులుకు సాక్షాలు ఇదిగో అంటూ అవినీతి ఆరోపణలు వెలికి తీస్తున్నారు .

తెలంగాణలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే‌:అసదుద్దీన్ ఒవైసీ

Submitted by chandram on Fri, 11/30/2018 - 15:43

తెలంగాణలో సీఎం పీఠం ఎవరు అధిగమిస్తారు అనే సందేహం పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖాలు చేశారు. మళ్లీ తెలంగాణ గడ్డపై కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికవుతారని ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావాడానికి ఏఐఎంఐఎం మద్దతు అవసరం లేదని తేల్చిచెప్పారు. అసదుద్దీన్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యాయ్నామంగా తప్పకుండా మరో రాజకీయ వేదిక ఏర్పడటం ఎంతో అవసరమని అన్నారు.

ఉద్యోగాల కోసం నినదించిన వారిపై ప్రభుత్వం పగబట్టింది : కిషన్ రెడ్డి

Submitted by arun on Fri, 11/30/2018 - 13:36

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని హైదరాబాద్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో అన్నారు. ఉద్యోగాల భర్తీని కేసీఆర్ గాలికి వదిలేశారని కిషన్ రెడ్డి మండి పడ్డారు. ఉద్యోగాల కోసం నినదించిన వారిపై ప్రభుత్వం పగబట్టిందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు తప్పుల మీద తప్పులు చేసిందన్న కిషన్ రెడ్డి అసలు కొత్త జిల్లాల ఎందుకు ఏర్పాటు చేశారో మంత్రులకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

ఆ రెండింటికే కేసీఆర్ పరిమితమయ్యారు: విజయశాంతి

Submitted by chandram on Fri, 11/30/2018 - 13:18

తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడి నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఆపద్దర్మ ముఖ్మమంత్రి కెసిఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు. కెసిఆర్ కేవలం ఫాంహౌస్, ప్రగతి భవన్ లకే పరిమితమయ్యారని దుయ్యాబట్టారు. శేరిలింగంపల్లి మహాకూటమి (టీడీపీ) అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కు మద్దతుగా ఆమె ప్రచారం భాగంగా విజయశాంతి ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ సర్కార్‌ని తిరిగి ఇంటికి పంపాలని కోరారు. నీళ్లు, నిధుల పేరుతో మనల్ని నిండా ముంచారని మండిపడ్డారు.

ఫామ్‌హౌస్‌ తప్ప కేసీఆర్‌ ఏమీ నిర్మించలేదు: చంద్రబాబు

Submitted by arun on Fri, 11/30/2018 - 11:49

హైదరాబాద్ ను తానే కట్టానని అనడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేసీఆర్ నన్ను చూసి ఎగతాళి చేశారన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ నిర్మించలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైబరాబాద్ తన మానసపుత్రిక అని అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దానని బాబు చెప్పారు.  హైదరాబాద్ లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రపంచంలోనే ఓ అద్భుతమన్నారు.అమరావతి ప్రజావేదికలో భాగంగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. 2024 కోసం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సూచించారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
 

కొడంగల్‌లో ఏం జరుగుతోంది...రేవంత్ ఆరోపణలు వెనక అసలు వాస్తవాలు ఏంటి ?

Submitted by arun on Fri, 11/30/2018 - 10:50

కొడంగల్‌ ఎన్నిక వాయిదా వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయా ? ఐటీ రైడ్స్ వెనక దురుద్దేశాలున్నాయా? డబ్బు తరలింపులో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారా? కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు వెనక అసలు వాస్తవాలు ఏంటి ? 

కొడంగల్‌ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్‌ రెడ్డి బంధువుల ఇళ్లపై మంగళవారం అర్ధరాత్రి ఐటీ దాడులు జరిగినట్టు ఈసీ ప్రకటించింది. ఈ సోదాల్లో 51 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలియజేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామన్నారు.

కేసిఆర్ పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటున్న ప్రజాకూటమి

Submitted by chandram on Thu, 11/29/2018 - 19:52

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. నాలుగేళ్లలో కనీసం ఒక్కసారి అపాయింట్ మెంట్ ఇవ్వని తమ గోడు వినని కేసిఆర్ పై కత్తి కట్టిన కేజీ టు పీజీ జేఏసి ఇవాళ రాహుల్ ని కలసి తమగోడు వెళ్లబోసుకుంది అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ తమను గెలిపిస్తే  ఫీజు రియింబర్స్ మెంట్ కల్పిస్తామని హమీ ఇచ్చింది. అలా విద్యా వ్యవస్థ కూడా ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. తెలంగాణలో అధికారం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మహాకూటమి కేసిఆర్ పై రేగుతున్న ప్రతీ వ్యతిరేకతనూ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.