police

ప్రణయ్‌ను హత్య చేయించింది అతడే: పోలీసులు

Submitted by arun on Sat, 09/15/2018 - 12:27

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక ప్రణయ్ ను మారుతిరావే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మారుతీరావు, తిరునగరు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తితో హత్య చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు ప్రణయ్ ఇంటి ముందు హంతకుడు స్కూటిపై రెక్కి నిర్వహించినట్లుగా గుర్తించారు పోలీసులు. హంతకుడు రెక్కి నిర్వహించిన తర్వాతే  ప్రణయ్ తల్లి.. భార్యతో కలిసి హస్పిటల్ కు వెళ్లారు.

పోలీసులనే బెదిరించాడట

Submitted by arun on Fri, 08/03/2018 - 12:37

పోలీసులనే  బెదిరించాడట మంత్రుల, 
మనిషినని ,చర్చి గురించిన చర్చలో 
వినకుంటే బాగోదని తెలిపాడట,

అధికారులు కనిపెట్టారట కుతంత్రమని. శ్రీ.కో

కేంద్రమంత్రి ఓఎస్డీ పేరుతో ఎస్పీ, సీఐలను బెదిరించిన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చర్చి విషయంలో తాను చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించాలంటూ పోలీసులను అనిల్ బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అనిల్ ఫోన్ నెంబరు ఆధారంగా వివరాలు సేకరించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌పై ఐపీసీ 120(బి), 506,185, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags

రికార్డింగ్ డ్యాన్స్‌లను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడి

Submitted by arun on Thu, 07/26/2018 - 14:48

నెల్లూరు జిల్లా కావలి కొత్తసత్రంలో పోలీసులపై మత్స్యకారులు దాడికి దిగారు. రికార్డింగ్‌ డ్యాన్సులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై మూకుమ్మడిగా మత్స్యకారులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎస్సై పుల్లారావు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన పోలీసులు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

శరత్‌‌ను చంపిన దుండగుడి కాల్చివేత

Submitted by arun on Mon, 07/16/2018 - 11:54

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో తెలంగాణ విద్యార్థిని శరత్‌‌ను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. కేన్సస్‌లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో  నిందితుడు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం జల్లెడపట్టారు. ఈ క్రమంలో దుండగుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దాంతో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు.

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన పోలీసులు

Submitted by arun on Mon, 07/16/2018 - 11:44

చిత్తూరు జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. అమాయకుడైన రైతుపై చౌడేపల్లి ఎస్‌ఐ, సిబ్బంది దాడి చేయడంతో బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడు. సోమల గ్రామానికి చెందిన గణేశ్‌ అగ్రికల్చర్‌లో బీఎస్సీ చేశాడు. వ్యవసాయంలో డిగ్రీ చేయడంతో రైతుగా స్థిరపడ్డారు. తాను పండించిన టమోటను అమ్ముకునేందుకు చౌడేపల్లి మార్కెట్ బయలుదేరాడు. 

బురిడీ బాబా అరెస్ట్

Submitted by arun on Sat, 07/14/2018 - 10:11

నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా మరో బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. పూజలు, యజ్ఞాలు చేస్తే నగలు రెండింతలు అవుతాయని జనం సొమ్ములు కాజేస్తున్న ఆ దొంగబాబాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాషాయ దుస్తుల్లో కనిస్తున్న వీడే బురిడీ బాబా. పేరు రామశివానంద పుట్టింది కేరళలో. చిన్నప్పటి నుంచే సన్యాసం తీసుకున్న శివానంద వేదమంత్రాల పేరుతో జనాన్ని మోసం చేయడం ప్రారంభించాడు. ఎలాంటి సమస్యకైనా తన యజ్ఞ, యాగాలతో పరిష్కారం చూపుతానంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నాడు. 

పోలీసుల అదుపులో మహిళా కిడ్నాపర్ ..

Submitted by arun on Thu, 07/05/2018 - 10:48

కోఠి మెటర్నిటీ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్  చేసిన మహిళను పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితురాలు నైనారాణిని బీదర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి... హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నైనా బీదర్‌లోని షాగంజ్‌లో నివాసం ఉంటోంది. ఆమె భర్త సైమన్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తనకు రెండుసార్లు గర్భస్రావం అయిందని, భవిష్యత్తులో పిల్లలు పుట్టరన్న అనుమానంతోనే చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు నైనా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు వివరించింది.

పసికందు కిడ్నాప్‌ కేసులో పురోగతి

Submitted by arun on Tue, 07/03/2018 - 12:48

ఆరు రోజుల పసికందు అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న మధ్యాహ్నం 12గంటల సమయంలో కోఠి మెటర్నటీ ఆస్పత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లిన మహిళ తెలంగాణ ఆర్టీసీ బస్సులో బీదర్‌ వెళ్లినట్టు గుర్తించారు. ఎంజీబీఎస్‌లోని సీసీ టీవీ  ఫుటేజ్‌ ఆధారంగా బస్సు నెంబర్‌ను ట్రేస్‌ చేశారు. బీదర్‌ వెళ్లిన టీఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ను పోలీసులు విచారించారు.

షాకింగ్: మహిళా కానిస్టేబుల్ కూతురిపై డీసీపీ అత్యాచారం

Submitted by arun on Thu, 06/28/2018 - 11:45

మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్‌ శ్రీరామ్ పై  ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న గుంటూరు చోరీ కేసు...కోడలు శివపార్వతి చుట్టూ తిరుగుతున్న విచారణ

Submitted by arun on Fri, 06/15/2018 - 15:51

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీ ఘటన.. కీలక మలుపు తిరిగింది. తెలిసిన వారే ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా కుటుంబ సభ్యుల సహకారంతోనే దుండగులు దోచుకున్నారని.. తేల్చారు. దొంగతనంలో పాలు పంచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం తెలుసుకున్నారు. ముఖ్యంగా కోడలు.. శివపార్వతిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను ప్రత్యేకంగా విచారిస్తున్నారు.