ind vs aus

మైదానమైనా.. ఎయిర్‌పోర్ట్‌ అయినా ధోనీకి పూల పాన్పే!

Submitted by lakshman on Tue, 09/19/2017 - 16:53

చెన్నై: టీమిండియా గురించి మాట్లాడుకునే ప్రతీ సందర్భంలో ధోనీ గురించి ప్రస్తావన రాకుండా ఉండదనడంలో అతిశయోక్తి లేదేమో. అంతలా క్రికెట్ అభిమానుల మనసుని చొరగొన్న ధోనీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత నెల శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఎంపైర్ నిర్ణయం రావడం కాస్త ఆలస్యమైంది. అంతే.. ధోనీ ఒక్కసారిగా చిన్న పిల్లాడైపోయాడు. స్టేడియంలోనే.. నేల మీద కాసేపలా బోర్ల పడుకుని కునుకు తీశాడు. ఈ సీన్ చూసిన క్రికెట్ అభిమానులు ధోనీ సింప్లిసిటీని మెచ్చుకున్నారు.