Konda Surekha

అందుకే కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు

Submitted by arun on Sat, 09/08/2018 - 16:12

టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్యనేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిప‌డ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్‌ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:52

తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని ఆరోపించారు. ఇది కేవలం తననే కాకుండా రాష్ట్రంలోని బీసీలను, తెలంగాణ మహిళలు అందరినీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ అన్నది కల్వకుంట్ల ఇల్లు కాదన్నారు. తెలంగాణను కల్వకుంట్ల వారి ఇల్లుగా మార్చుతానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

ఆ సీటు ఇస్తేనే వస్తామని చెప్పాం: కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:14

టీఆర్ఎస్‌ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జంబో లిస్ట్‌లో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. బీసీ మహిళననే నా పేరు ప్రకటించకుండా అవమానించారని ఆరోపించారు. మేం చేసిన తప్పేంటో తెలియజేయాలన్నారు. కార్పొరేషన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా డబ్బులు ఖర్చు చేసి గెలిపించామని వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని...అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు.

12న కాంగ్రెస్ లోకి కొండా సురేఖ...మధ్యాహ్నం టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం

Submitted by arun on Sat, 09/08/2018 - 08:53

కొండా దంపతుల రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో కొండాసురేఖ లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలేం జరుగుతోంది.? ఎవరికి టికెట్ ఇస్తారన్న దానిపై ఓరుగల్లులో చర్చనీయాంశమైంది. ఇంతకూ కొండా పరిస్థితేంటి.. కేసీఆర్ నిర్ణయం వెనక జరిగిందేమిటి.? ఇప్పుడు కొండా దంపతుల దారెటు.? 

ఎమ్మెల్యే కొండ సురేఖకు అవమానం

Submitted by arun on Wed, 08/01/2018 - 12:51

ఎమ్మెల్యే కొండ సురేఖకు అవమానం జరిగింది. వరంగల్‌ అర్బన్ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను అధికారులు వేదికపైకి పిలవలేదు. సాక్షాత్తు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పాల్గొన్న సభలోనే తనను వేదికపైకి పిలవకపోడంతో  కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కార్యక్రమం జరుగుతుండగానే మధ్యలో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి కడియం కొండా సురేఖకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.  

ఓరుగల్లు ఖిల్లా 2019 ఎన్నికల్లో సంచలనంగా మారనుందా ?

Submitted by arun on Thu, 04/26/2018 - 12:56

ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు ఖిల్లా 2019 ఎన్నికల్లో  సంచలనంగా మారనుందా ? ఎన్నికలకు ముందు అధికార పార్టీలో జంప్ జిలానీలు పెరగనున్నారా ?  బస్సు యాత్రతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారాయా ? కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు హస్తం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా ?  అధికార పార్టీకి చెందిన నేతలు మూడు రంగుల కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా ?  ఇప్పుడీ  అంశాలే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు జిల్లాల పరిధిలో అసలు ఏం జరుగుతుందో తెలియక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.