Shoaib Malik

మేం పెళ్లి చేసుకుంది భార‌త్‌-పాక్‌ల‌ను క‌ల‌ప‌డానికి కాదు: సానియా మీర్జా

Submitted by arun on Tue, 08/14/2018 - 13:04

ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ప్రస్తుతం అంతర్జాతీయ టెన్నిస్‌కు దూరంగా ఉంది. గర్భవతి అయిన కారణంగా ప్రొఫెషనల్ కెరీర్‌ నుంచి బ్రేక్ తీసుకున్న సానియా తొలి సంతానం కోసం ఎదురుచూస్తోంది. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మహిళా టెన్నిస్ దిగ్గజం సానియా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.`భార‌త్, పాకిస్తాన్‌ల‌ను క‌ల‌ప‌డం కోస‌మే మేం పెళ్లి చేసుకున్నామ‌ని చాలామంది అపోహ ప‌డుతుంటారు. కానీ, అది నిజం కాదు. నా భ‌ర్త త‌ర‌ఫు బందువుల‌ను క‌ల‌వ‌డానికి నేను సంవ‌త్స‌రానికి ఓ సారి పాకిస్తాన్ వెళ్తాను. అక్క‌డ నాకు ల‌భించే ప్రేమ, గౌర‌వం అపారం. ఆ దేశ ప్ర‌జ‌లంద‌రూ న‌న్ను వ‌దిన‌గా భావిస్తారు.

తల్లి కాబోతున్న సానియా

Submitted by arun on Tue, 04/24/2018 - 14:29

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది, అక్టోబర్‌ నెలలో సానియా మీర్జా అమ్మతనాన్ని ఆస్వాదించనుంది. పుట్టబోయే బిడ్డకు మీర్జామాలిక్ అని పేరు పెట్టాలని షోయబ్‌ మాలిక్‌, సానియా మీర్జా డిసైడ్ అయ్యారు.