transgenders

హిజ్రాలకు మద్దతిచ్చిన గంభీర్

Submitted by arun on Fri, 09/14/2018 - 11:48

ఇండియన్ యంగ్ క్రికెటర్స్‌లో గౌతమ్ గంభీర్ రూటే సెపరేటు. ఎవరెన్నీ అనుకున్న తనకు నచ్చిందే చేస్తాడు. టీమిండియాలో లేకపోయిన.. భారతీయ మనసుల్లో మాత్రం తన గొప్ప పనులతో గంభీర్ చెరగని ముద్ర వేసుకున్నాడు. భారత సైనికులకు, అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడంలో ముందున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ గంభీర్. సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ ఏడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు.

మహిళలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారా?

Submitted by arun on Sat, 04/07/2018 - 14:38

నిజమా... లేడీస్‌ జీన్స్‌ వేసుకోవద్దా? వేసుకుంటే నపుంసకులు పుడతారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు కేరళ ప్రొఫెసర్‌ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు? పుట్టకతోనే హిజ్రాలుగా పుడతారా? ఇంటర్‌ సెక్స్‌ అనే అరుదైన కేసుకు జీన్స్‌కు ఎందుకు లింక్‌ పెట్టారు?

పేరు డాక్టర్‌ రజిత్‌కుమార్‌. కేరళలో ప్రొఫెసర్‌. అధ్యాపక వృత్తిలో ఉన్న రజిత్‌కుమార్‌ అంత చదువుకొనీ ఇలా మాట్లాడరని చర్చించుకుంటుంది మహిళాలోకం. కేరళలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ తీసుకుంటున్న రజిత్‌కుమార్‌ తమను తీవ్రంగా అవమానంచారంటారు ట్రాన్స్‌జెండర్లు.