vijay devarakonda

జగన్ పాత్రలో సెన్సేషనల్ హీరో

Submitted by arun on Fri, 09/14/2018 - 13:24

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సూర్య గానీ .. కార్తీ గాని జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ వచ్చింది. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కారణంగానే వారిద్దరిలో ఎవరో ఒకరు ఇందులో నటించనున్నారని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఫిలింనగర్‌లో సమాచారం.

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Submitted by arun on Wed, 09/12/2018 - 11:19

యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగానే రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పూరి వేయబోతున్నడట మరో సినిమా దోశ

Submitted by arun on Mon, 09/10/2018 - 11:48

పూరి వేయబోతున్నడట మరో  సినిమా దోశ,

దేవరకొండతో రుచించునని ఈ మసాలా ఆశ,

ఈనాటి ఇడియట్ కొడతాడట మాటల బాషా,

అంతా ఆ గోవిందుడి చేతిలోని తమాషా. శ్రీ.కో. 

మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా

Submitted by arun on Fri, 08/24/2018 - 10:48

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌లను కలిశారు. ఈ సందర్భంగా తాను గీతగోవిందం సినిమాను రెండు సార్లు చూసినట్టు కవిత వెల్లడించారు. సినిమా చూశారా? ఎలా ఉంది? అని కవితను విజయ్ దేవరకొండ అడగ్గా.. ‘మస్తుంది సినిమా.. మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా’ అని నవ్వుతూ తెలిపారు. ‘సినిమా రెండు సార్లు చూశాను. ఫస్ట్ నేను చూశాను. తరువాత మా వదినా వాళ్లు చూద్దాం అంటే వెళ్లాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలనుకుంటున్నారు’’ అని తెలిపారు కవిత.

విజయ్ దేవరకొండకు మరో ఎదురుదెబ్బ..

Submitted by arun on Tue, 08/21/2018 - 09:47

ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సీన్లను లీక్ చేసిన దుండగులు.. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాను రిలీజ్ కు ముందే బయటపెట్టారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ‘ట్యాక్సీవాలా’కు షాక్ తగిలింది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొందరు దుండుగులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

Submitted by arun on Mon, 08/20/2018 - 12:43

ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ.  'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి 'అర్జున్ రెడ్డి'తో ఊపందుకుని తాజాగా విడుదలైన 'గీత గోవిందం'తో తారా స్థాయికి చేరుకుంది.  ఎప్పటికప్పుడు తన నటనతో, యాటిట్యూడ్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు విజయ్. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ 15 ఏళ్లలో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ అందరూ స్టార్లు అయ్యారని... 20 ఏళ్ల క్రితం 'తొలిప్రేమ' సినిమాతో యూత్ ను పవన్ కల్యాణ్ షేక్ చేశారని... ఇప్పుడు తనకు విజయ దేవరకొండ అలా కనిపిస్తున్నాడని దిల్ రాజు అన్నారు.

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ

Submitted by arun on Wed, 08/15/2018 - 12:47

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

అమ్మాయిలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా : హీరోయిన్ వార్నింగ్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:18

‘అర్జున్ రెడ్డి’లో హార్డ్‌కోర్ లవర్‌గా నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ రూట్ మార్చాడు. ‘గీత గోవిందం’తో మృదువైన ప్రేమికుడిగా కనిపించాడు. ఈ చిత్రం టీజర్ కాసేపటి కింద విడుదలైంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీలో విజయ దేవరకొండ, రష్మిక మందన జంట కనువిందు చేస్తోంది. 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ' అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ లో కలలు కంటూ హీరోయిన్ కు ముద్దు పెడతాడు.. హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో రియాలిటీలోకి వస్తాడు. ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం, నేను మారిపోయాను మేడమ్.. ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ..

అర్జున్ రెడ్డి ఇంటికి కేటీఆర్

Submitted by arun on Mon, 06/25/2018 - 12:25

‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి గానూ మొదటి ఫిలింఫేర్‌ను అందుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ.. తన అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలపగా సంతోషించిన మంత్రి, విజయ్‌ నిర్ణయాన్ని అభినందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సాయంత్రం విజయ్ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియాలో తెలుపుతూ 

‘ఏ మంత్రం వేసావె’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 03/09/2018 - 13:59

టైటిల్ : ఏ మంత్రం వేసావె
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, శివాని సింగ్‌, శివన్నారాయణ, ఆశిష్‌ రాజ్‌
సంగీతం : అబ‍్బట్‌ సమత్‌
దర్శకత్వం : శ్రీధర్‌ మర్రి
నిర్మాత : గోలీసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్‌