IPL

ఐపీఎల్ -11లో వాట్సన్ అరుదైన రికార్డులు

Submitted by arun on Mon, 05/28/2018 - 16:49

ఐపీఎల్ 11వ సీజన్ టోర్నీలో....విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఫైనల్లో అన్ బీటెన్ సెంచరీతో...ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు అందుకొన్న వాట్సన్...ప్రస్తుత 2018 సీజన్లో రెండు సెంచరీలు సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు...తన కెరియర్ ఐపీఎల్ శతకాల సంఖ్యను నాలుగుకు పెంచుకొన్నాడు. 36 ఏళ్ల వాట్సన్....ప్రస్తుత సీజన్ లీగ్ దశలో ఓ సెంచరీ, ఫైనల్లో ఓ సెంచరీతో పాటు...మొత్తం 555 పరుగులు సాధించాడు.

క్రీడలను స్వార్థానికి వాడుకుంటున్న పొలిటిషియన్లు

Submitted by arun on Thu, 04/12/2018 - 12:21

క్రీడలకు, రాజకీయాలతో సంబంధమే లేదు. దశాబ్దాలుగా క్రీడలు, రాజకీయాలు వేర్వేరు రంగాలు. ప్రస్తుతం రాజకీయ నేతలు క్రీడలను పావుగా వాడుకుని జనాన్ని రెచ్చగొడుతున్నారు. క్రీడలకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ చదరంగం సామాన్యులు బలవుతున్నారు. క్రీడలకు అంతరాయం కలుగుతోంది.

Tags

ష‌మీ క్రికెట్ కెరీర్ కు బ్రేక్ ఇవ్వండి

Submitted by lakshman on Sun, 04/01/2018 - 23:54

షమీ క్రికెట్ కెరీర్ బ్రేక్ ఇవ్వాలంటూ అతని భార్య హసీన్ జహాన్ ఆరోపిస్తోంది. వారిద్దరి మధ్య వివాదాలు పరిష్కరించుకునేంత వరకు క్రికెట్ మ్యాచ్ లు ఆడనివ్వకూడదంటూ అతని భార్య మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో బీసీసీఐ జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశాడు.