snakes

కేరళలో ఒకే ఇంట్లో వంద పాములు

Submitted by arun on Fri, 08/24/2018 - 16:20

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో  ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాడైపోయిన తమ వస్తువులు, ఇతరాలను చూసి బావురుమంటున్నారు. కొందరి ఇళ్ళలో నీటిలో  కొట్టుకొచ్చిన పాములు, విష కీటకాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేరళలో వరదలు తగ్గు ముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు కేరళకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదల వల్ల ఇప్పటివరకూ దాదాపు 350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాలు ఇళ్లు, రోడ్లు నీళ్ల మయంగా మారాయి. 

ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు

Submitted by arun on Wed, 08/22/2018 - 14:16

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా...ఇళ్లకు చేరుతున్న వారికి పాములు, మొసళ్లు దర్శనమిస్తున్నాయ్. మొన్నటి వరకు వరదలు వణికిస్తే ఇప్పుడు మొసళ్లు, పాములు భయపెడుతున్నాయి. పునరావాసాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వారికి ఇళ్లలో పాములు, మొసళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కేరళలో వరద తగ్గినా స్థానికుల కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. 

స్టేషన్ లో సీమకోళ్లు...సీమకోళ్లను పెంచుతున్న పోలీసులు

Submitted by arun on Wed, 07/25/2018 - 15:46

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీమకోళ్ల అంశం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అవును స్టేషన్ లో సీమకోళ్లు ఏంటనే డౌట్ వస్తుందా. ఏదో నేరంలో కోళ్లను అక్కడకు తీసుకురాలేదు. కానీ రెండు సీమకోళ్లు మాత్రం  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నాయి. 

బండ కింద పాముల పుట్ట

Submitted by arun on Sat, 03/31/2018 - 13:06

ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో పాముల పిల్లలు. అది కూడా ఒకే బండరాయి కింద బయటపడ్డాయ్. వందల సంఖ‌్యలో పాములను చూసిన గ్రామస్తులే విస్తుపోవాల్సి పరిస్థితి ఎదురైంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌కు చెందిన మొగులప్ప సోదరుడికి కాలు విరగడంతో ఇంటి ముందున్న బండరాయిపై చెట్ల పసురు తీస్తుండగా ఓ పాము బయటికి వచ్చింది.