JD Lakshmi Narayana

పార్టీ ఏర్పాటుపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ...

Submitted by arun on Sat, 08/18/2018 - 12:12

కొంతకాలం కిందట వీఆర్‌ఎస్‌ తీసుకొని ఏపీలో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా పలువురు నేతలు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఓ సందర్భంలో విమర్శలు చేశారు కూడా. ఆయన బీజేపీ చేరతారంటే... కాదు, జనసేనలో చేరాయం పక్కా అని అంచనాలు వేశారు. కానీ, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధంలేకుండా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... రైతులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా పార్టీ పెట్టడం కోసమే చేస్తున్నారనే అభిప్రాయాలు కొందరు వెలిబుచ్చారు. 

ఆ వార్తల్లో వాస్తవం లేదు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Submitted by arun on Thu, 05/31/2018 - 17:51

ప్రజాసేవ చేయాలన్న తపనతో అత్యున్నతమైన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి... ఏపీలో పల్లెబాట పట్టారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అయితే, బీజేపీలో ఆయన చేరబోతున్నారని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనే ప్రచారం ఓవైపు జరుగుతోంది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలో వాస్తవం లేదని, జిల్లాల పర్యటన పూర్తి చేసిన తరువాతే... రాజకీయ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం అయినట్టే... రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

Submitted by arun on Tue, 03/27/2018 - 11:39

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు నడుస్తున్న చర్చ ఇది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే జనసేనలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తన పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయనొస్తానంటే నేనొద్దంటానా అని చెప్పేశారు. జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకొనేందుకు టీడీపీ, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే సీబీఐ మాజీ జేడీ చూపు పవన్ పార్టీపై ఉన్నట్టు సమాచారం.