west bengal

ప్రధాని బహిరంగసభలో అపశృతి...20 మందికి గాయాలు

Submitted by arun on Mon, 07/16/2018 - 15:19

పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ ప్రధాని మోడీ నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ లో కొంత భాగం కూలిపోయింది. ఈఘటనలో 20 మంది గాయపడ్డారు. టెంట్ కూలిపోవడంతో ఆందోళనకు గురైన జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగానే ఎక్కువ మంది గాయపడ్డారు. ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలోనే టెంట్ కూలడం ఆయన వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. స్పీచ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన మమతా బెనర్జీ

Submitted by arun on Mon, 03/19/2018 - 15:44

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బెంగాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌ అండ్‌ టీమ్‌కి మమతా సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ, కేసీఆర్‌ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు.

పెళ్లిలో భార్య డాన్స్ చేసిందని..

Submitted by arun on Mon, 03/19/2018 - 13:12

పెళ్లిలో డాన్స్ చేసిందనే కారణంతో భార్యను అతిదారుణంగా చంపాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో  ఇటీవలే  వివాహం జరిగింది.  అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్లిన స్వప్నను..

బీజేపీకి బిగ్‌ షాక్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 12:08

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ రాష్ట్రంలోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఝలక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక రాజస్థాన్‌లోని ఆల్వార్‌, అజ్మీర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.

కృషి ఉంటే.. మనుషులు రుషులౌతారు!

Submitted by lakshman on Mon, 09/18/2017 - 16:53

పశ్చిమబెంగాల్ల్లో ఓ మారుమూల ఊరు బబ్తా. ఆ ఊళ్లో ‘బాబర్ ఆలీ అనే చిన్న కుర్రవాడు. అతనికి చదువంటే ఇష్టం. అందుకనే కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి నడిచి ఓ బడికి వెళ్లి చదువుకునేవాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తన తోటి పిల్లలంతా చదువు మీద దృష్టి పెట్టకుండా ఆటపాటల్లో గడిపేయడం అతన్ని ఆలోచింపచేసింది. ఆ తర్వాత అతను ఏం చేశాడు అన్నది ఓ చరిత్ర! బాబర్ ఆలీ ఐదో తరగతి చదువుకుంటుండగా... చదువుకునే అవకాశం లేని తన తోటి పిల్లలకి కూడా ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇంటి ముందర ఉన్న జామచెట్టు కింద నలుగురినీ పోగేసి చదువు చెప్పడం మొదలుపెట్టాడు.