Ram Kadam

సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

Submitted by arun on Sat, 09/08/2018 - 11:19

క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌కు నెటిజన్లు చుక్కలు చూపించారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్‌ కదమ్‌ ట్వీట్‌ చేశారు.

అసెంబ్లీలో వివాదాస్ప‌దమైన ఎలుక‌ల పంచాయితీ

Submitted by lakshman on Sat, 03/24/2018 - 11:07

అసెంబ్లీ లో ప్ర‌జాస‌మ‌స్య‌లు చ‌ర్చించాల్సినే నేత‌లు ఎన్ని ఎలుక‌ల్ని చంపారు..? ఆ ప్ర‌దేశంలో ఎన్నిఎలుక‌లు ఉన్నాయి. ఎలుక‌ల్ని చంపే యంత్రాలు ఏమైనా ఉన్నాయా..? ఎలుక‌ల్ని చంపేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలుక‌ల పై డిమాండ్ వివాదం చెల‌రేగుతుంది. 
అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించ‌కుండా ఎన్నిఎలుక‌లు చంపారు..? అనే అంశంపై చ‌ర్చించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. సీనియ‌ర్ బీజేపీ నేత , మ‌హ‌రాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖ‌డ్సే మంత్రాల‌యంలో ఎలుక‌ల్ని చంప‌డానికి ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.