rangasthalam

అతడ్ని కిడ్నాప్‌ చేస్తా: సమంత

Submitted by arun on Fri, 06/08/2018 - 16:24

రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్‌ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్‌ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్‌ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.

‘రంగస్థలం’ క్లైమాక్స్‌ వివాదం.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్‌

Submitted by arun on Tue, 05/29/2018 - 13:04

రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా తాను రాసుకున్నదే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌కు ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ నేతృత్వంలోని సంఘం..... సుకుమార్ వివరణతో ఏకీభవిస్తూ అధికారిక నోటీసు జారీ చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఫిర్యాదుదారు, సినీ రచయిత యం. గాంధీకి సూచించింది.

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

Submitted by arun on Fri, 04/20/2018 - 11:55

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.

ఇద్దరు బిడ్డల తల్లినైతే నటించకూడదా?: అనసూయ

Submitted by arun on Mon, 04/16/2018 - 13:37

బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులకు ‘రంగమ్మత్త’ అయిపోయారు. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే అనసూయను ఇద్దరు బిడ్డలకు తల్లివి... హాట్‌ యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం, ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం నీకు అవసరమా అని చాలామంది నెటిజన్లు నన్ను విమర్శిస్తున్నారట. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు నటించకూడదా? అంటూ ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో పెళ్లై పిల్లలున్న తారలు ఇప్పటికీ తెరపై అలరిస్తున్నారు. ఒక్క తెలుగు కథానాయికలపైనే ఈ విమర్శలు.

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

Submitted by arun on Sat, 04/14/2018 - 14:36

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది. 

అది నిజం ముద్దు కాదు...

Submitted by arun on Wed, 04/11/2018 - 11:43

రామ్ చరణ్, సమంతల కామినేషన్లో వచ్చిన 'రంగస్థలం' మూవీ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఓ చుంబన దృశ్యం ఉంది. ఈ ముద్దు సీన్ పై తాజాగా ఓ మీడియా సంస్థలో సమంత స్పందించింది. వాస్తవానికి అది నిజమైన ముద్దు కాదని తెలిపింది. చరణ్ బుగ్గపై తాను ముద్దు పెట్టానని... దాన్ని ఒక కెమెరా ట్రిక్కుతో లిప్ లాక్ లా భ్రమించేలా తీశారని చెప్పింది. కథకి ఆ సన్నివేశం అవసరం కాబట్టే అలా చిత్రీకరించాల్సి వచ్చిందని తెలిపింది. నేను ఓ నటిని. సన్నివేశానికి తగినట్టుగా నటించాలి. పెళ్లయిన కథానాయికని ‘లిప్‌ లాక్‌ ఎందుకు చేశారు’ అని అడిగినట్టు.. పెళ్లయిన కథానాయకుల్ని అడగరెందుకని?

సుకుమార్ నన్ను కొట్టలేదు: మహేష్

Submitted by arun on Fri, 04/06/2018 - 17:57

'రంగస్థలం' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల దగ్గర సందడి .. భారీగా వసూళ్లు పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా టీమ్ .. ఇటీవల సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో కమెడియన్ మహేశ్ పై సుకుమార్ చేయి చేసుకున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై మహేష్ స్పందించాడు. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఆయన కాళ్లకు నమస్కరించబోయానని.. తనను వద్దని సుక్కు వారించారే తప్ప తనను కొట్టలేదని పేర్కొన్నాడు. ఒకవేళ కొట్టినా ఇంకా సంతోషించేవాడినంటూ తన స్వామి భక్తిని వెల్లడించాడు మహేష్.
 

పాట మార్పుపై స్పందించిన సుకుమార్

Submitted by arun on Tue, 04/03/2018 - 15:09

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్షింపబడుతోంది. చిత్రంలో నటించిన అందరు నటీనటులకు ఫుల్ క్రెడిట్ దక్కింది. భారీ కలెక్షన్స్‌తో రికార్డులను తిరగ రాస్తూ పరుగులు పెడుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ సినిమాలోని ఓ పాట విషయంలో అనుకోని వివాదం తలెత్తడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ తరువాత ఈ గట్టునుంటావా పాటపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. పాటకు ఆడియోలో శివ నాగులు గొంతు వినిపించగా..