selfie

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ...స్పందించిన యాజమాన్యం

Submitted by arun on Fri, 08/31/2018 - 16:56

నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే అక్కడ పనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో  సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి స్మైలీతో సెల్ఫీ దిగటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏకంగా జడ్జీ సీటులో కూర్చొని.. అడ్డంగా బుక్కయ్యాడు!

Submitted by arun on Mon, 07/02/2018 - 17:27

శిక్షణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సెల్ఫీ మోజులో.. జడ్జి చైర్‌లో కుర్చుని సెల్ఫీలు దిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రామ్‌ అవతార్‌ రావత్‌ అనే వ్యక్తి ఉమారియా పోలీస్‌ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్‌.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు. రావత్‌ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కొత్వాలి పోలీసులు రావత్‌పై కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పెళ్లిని ఆపిన సెల్ఫీ...తాళికట్టే సమయానికి...

Submitted by arun on Mon, 07/02/2018 - 13:14

సరిగ్గా తాళికట్టే సమయానికి ‘ఆపండి..’ అంటూ ఎవరో గట్టిగా అరవడం వధువు ప్రియుడిననో వరుడి ప్రేమికురాలిననో చెప్పి పెళ్లిని ఆపేయడం తెలిసిందే. టెక్నాలజీ యుగంలో ఇప్పుడు యువత వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ల ద్వారా ఆ పని కానిస్తోంది. తాళికట్టే సమయానికి వరుడి వాట్సాప్‌కు వచ్చిన ఓ సెల్ఫీ పెళ్లికి బ్రేకులు వేసింది.

సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. లాగి కొట్టిన మంత్రి

Submitted by arun on Mon, 02/05/2018 - 14:36

తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. అయితే, ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన చికాకు పుట్టిస్తుంది. ఇటువంటి అనుభవమే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్‌కి ఎదురైంది. కర్నాటక ఇందనశాఖ మంత్రి శివకుమార్ సెల్ఫీకి ప్రయత్నించిన అభిమానిని లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు కొందరు అభిమానులు ప్రయత్నించారు. ఓ వ్యక్తి ఆయన సమీపంలోకి వచ్చి స్వీయ చిత్రం తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో మంత్రి సహనం కొల్పోయారు. వెంటనే చేయి చేసుకున్నారు.

ప‌వ‌న్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఫయాజ్

Submitted by arun on Sat, 01/27/2018 - 16:35

అనంతపురం జిల్లా పర్యటనలో పవన్‌కల్యాణ్‌ను, ఆయన అభిమానులను ఖంగుతినిపించాడు ఓ వీరాభిమాని. జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన అనంతరం వేదికపై పవన్ ప్రసంగించారు. అక్కడే ఓ అభిమాని సెల్ఫీ కోసం వేదికపైకి దూసుకొచ్చి.. పవన్‌ను గట్టిగా తన కౌగిట్లో బంధించేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని విడిపించేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అతని పిచ్చి అభిమానాన్ని అర్థం చేసుకున్న పవన్ సెల్ఫీ దిగి పంపించారు. 

అందరినీ ఫూల్ చేద్దామనుకొని చివరికి తానే ఫూల్ అయ్యాడు...

Submitted by arun on Thu, 01/25/2018 - 19:22

వైరల్‌గా మారిన ట్రైన్ సెల్ఫీ వీడియోపై.. మరో వీడియో రిలీజ్ చేశాడు సెల్ఫీ శివ. తాను సేఫ్‌గానే ఉన్నానని ఆ వీడియోలో తెలిపాడు. తనకేం కాలేదని.. అందరినీ ఫూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. ప్రమాదం జరిగింది.. అతనికి గాయమైంది.. నిజమేనని రైల్వే పోలీసులు తేల్చేశారు. అతని చేత ఫైన్ కూడా కట్టించారు. దీనికి సంబంధించి.. రైల్వే పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో.. అందరినీ పూల్ చేద్దామనుకున్న సెల్ఫీ శివ.. తానే ఫూల్ అయ్యాడు.

Tags

అందంగా ఉందని నిందితురాలితో పోలీసుకానిస్టేబుల్ సెల్ఫీ దిగి...

Submitted by arun on Mon, 12/25/2017 - 10:31

ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని అనుకుంటూ, ఓ నిందితురాలితో సెల్ఫీ దిగటమే కాకుండా, ఆమెను తనతో కలసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ నగరంలోని దరియాపూర్ ప్రాంతానికి చెందిన అమీనా షేక్ (36) అనే మహిళ అక్రమంగా మద్యం బాటిళ్లను కారులో తీసుకువెళుతుండగా మొబైల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలైన అమీనా చాలా అందంగా ఉందని పోలీసు కానిస్టేబుల్ శైలేష్ చెబుతూ కారులోనే ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంత అందంగా ఉండటానికి ఏం క్రీమ్ రాస్తున్నావు అని కానిస్టేబుల్ శైలేష్ నిందితురాలిని అడిగినట్లు ఏసీపీ బల్దేవ్ దేశాయ్ చెప్పారు.

మార్కెట్‌లోకి జియోనీ ఎ1 లైట్

Submitted by lakshman on Sun, 09/17/2017 - 21:08

జియోనీ ఇండియా 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెవెురాతో కూడిన ఎ1 లైట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర 14, 999 రూపాయలు. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 20 ఎంపి సెల్ఫీ కెమెరా, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో ఎ1 లైట్‌ను తీసుకువచ్చినట్లు జియోనీ తెలిపింది. గొరిల్లా గ్లాస్, చిక్ మెటాలిక్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు పేర్కొంది.