Vajpayee

బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివదేహం...

Submitted by arun on Fri, 08/17/2018 - 11:38

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహనికి పార్టీ అగ్రనేతలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు నివాళులర్పించారు. అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల!

Submitted by arun on Thu, 08/16/2018 - 11:40

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. వాజ్‌పేయికి వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. 93 ఏళ్ళ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిదన్న వార్తలతో బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. 

బీజేపీ, మోడీపై విరుచుకుపడ్డ సోనియాగాంధీ

Submitted by arun on Fri, 03/09/2018 - 16:18

రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాక సెలైంట్‌గా ఉంటూ వస్తోన్న సోనియాగాంధీ బీజేపీపైనా, మోడీపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోడీ కంటే మన్మోహన్‌ పాలనే వెయ్యి రెట్లు బాగుందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సోనియా ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ వ్యవహారాలపై వాజ్‌పేయికి అమితమైన గౌరవం ఉండేదని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ వేధింపులకు గురవుతోందన్న సోనియాగాంధీ  ప్రజలను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ప్రతీ పథకానికీ ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తున్నారని ఆరోపించారు.