Mohammed Shami

షమీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తాం..

Submitted by chandram on Thu, 11/15/2018 - 17:47

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి ఇరాకటంలో పడ్డాడు. స్వయన షామీ భార్య హసీన్ జహాన్ తన భర్తపై కోర్టులో పిర్యాదు చేసింది, వారిద్దరి మధ్య గొడవలతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. కాగా షమీ ప్రతినెల తన భార్యకు కొంత డబ్బు ఇవ్వాలి అయితే ప్రతినెలలాగే ఈ నెల కూడా చెక్ పంపించాడు. అయితే చెక్కు డ్రా అవ్వకుండ షమీ కావలనే చేశాడని ఆగ్రహించిన భార్య కోల్‌కతా కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే దినిపై షమీ మాత్రం ఎలాంటి స్పందన కూడా ఇవ్వకపొగ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో తీవ్రస్థాయి షమీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హజరుకావలని నోటీసులు పంపీన షమీ బెఖాతార్ చేసాడు.

ష‌మీ క్రికెట్ కెరీర్ కు బ్రేక్ ఇవ్వండి

Submitted by lakshman on Sun, 04/01/2018 - 23:54

షమీ క్రికెట్ కెరీర్ బ్రేక్ ఇవ్వాలంటూ అతని భార్య హసీన్ జహాన్ ఆరోపిస్తోంది. వారిద్దరి మధ్య వివాదాలు పరిష్కరించుకునేంత వరకు క్రికెట్ మ్యాచ్ లు ఆడనివ్వకూడదంటూ అతని భార్య మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో బీసీసీఐ జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశాడు. 

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలు

Submitted by arun on Sun, 03/25/2018 - 11:27

రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ గాయపడ్డాడు. డెహ్రడూన్‌ నుంచి ఢిల్లీ వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. డెహ్రడూన్‌లో చికిత్స తీసుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడని సన్నిహితులు వెల్లడించారు. భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణలు చేయడంతో వ్యక్తిగత జీవితంలో షమీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు.  

కొంప‌ముంచిన వివాహేతర సంబంధాలు

Submitted by arun on Fri, 03/09/2018 - 13:21

టీమిండియా ఫాస్ట్ బౌలర్, బెంగాల్ ఎక్స్ ప్రెస్ మహ్మద్ షమీ కోరి కష్టాలు తెచ్చుకొన్నాడు. పండంటి బిడ్డ, అందమైన భార్య ఉండగా వివాహేతర సంబంధాలతో అసలుకే ఎసరు తెచ్చుకొన్నాడు. చివరకు కట్టుకొన్న భార్య కేసు పెట్టడంతో షమీ క్రికెట్ కెరియర్ గాల్లో దీపంలా మారింది. బెంగాల్ కు చెందిన 27 ఏళ్ల మహ్మద్ షమీ భారత క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఐదేళ్ల క్రితం భారతజట్టులోకి దూసుకొచ్చిన షమీ ఇప్పుడు కీలక బౌలర్ గా మారాడు. ఇటు టెస్టులు అటు వన్డేల్లో టీమిండియాకు తన మెరుపు ఫాస్ట్ బౌలింగ్ తో ఎన్నో ఒంటిచేతి విజయాలు అందించాడు.

షమీ అక్రమ సంబంధాలు బయట పెట్టిన భార్య

Submitted by arun on Wed, 03/07/2018 - 13:45

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు.