Mamata Banerjee

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు..19న మమతతో మంతనాలు

Submitted by chandram on Tue, 11/13/2018 - 20:00

దేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్ కతాకు పయనమయ్యారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీతో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఎలాగైన బీజేపీయేతర శక్తుల్ని ఏకాతాటిపైకి రావాలనే ప్రధాన అజెండాగా చంద్రబాబు వరుసగా ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు.  ఇటీవలే బెంగళూరు, చెన్నై వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో  మంతనాలు జరిపారు. మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి...మమతకు అమిత్ షా సవాల్

Submitted by arun on Thu, 08/02/2018 - 10:21

మమతా బెనర్జీ ప్రభుత్వం తనను బెదిరించలేదని, తాను కోల్‌కతా వెళ్లే తీరుతానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఈ నెల 11‌న కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని అమిత్ షా భావించారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్‌లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.

కర్ణాటక వేదికగా మోడీ వ్యతిరేక ఫ్రంట్ ప్రయత్నాలు...ఒక్కటైన 14 పార్టీల నేతలు

Submitted by arun on Thu, 05/24/2018 - 11:05

కర్ణాటక వేదికగా కొత్త శకం మొదలైంది. కుమారస్వామి ప్రమాణస్వీకార వేడుక.. మోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు బీజం వేసినట్లైంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 పార్టీల నేతలు ఒకే వేదికపై నుంచి.. భవిష్యత్ ఎన్నికలకు మేమంతా కలిసి వస్తున్నామనే సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్, లెఫ్ట్, ప్రాంతీయ పార్టీల నాయకులంతా ఒకే స్టేజ్‌పైకి చేరుకొని.. మోడీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటిగానే ఉన్నాయన్న సంకేతం ఇచ్చారు.

ఫ్రంట‌్‌లో వేగం...పలువురు నేతలు, సీఎంలను కలవనున్న కేసీఆర్

Submitted by arun on Thu, 04/12/2018 - 11:36

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై గులాబీ బాస్.. కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. సిద్ధాంత వైరుధ్యాలు పక్కనపెట్టి కలిసొచ్చే పార్టీలన్నిటిని కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సీపీఎం అగ్రనేతలతో ఫెడరల్ ఫ్రంట్ విధివిధానాలపై చర్చలు జరిపిన కేసీఆర్.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ కానున్నారు. త్వరలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. 

మమత.. అంత సులువుగా కేసీఆర్ కు చాన్స్ ఇస్తారా?

Submitted by arun on Wed, 03/28/2018 - 14:14

ఉత్తరాది రాజకీయ నాయకుల ఆధిపత్యం.. దక్షిణ రాష్ట్రాలపై ఎప్పుడూ కొనసాగుతూనే వస్తోంది. కానీ.. ఈ మధ్య.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించినప్పటి నుంచి ఈ పరిస్థితిలో మార్పు అని చెప్పలేం కానీ.. కాస్త కదలిక మాత్రం కనిపిస్తోంది. కేసీఆర్ అడుగులపై ఇతర పార్టీల నేతలు.. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి  మమతా బెనర్జీ వేస్తున్న అడుగులు కూడా.. రాజకీయ వర్గాలనే కాదు.. సామాన్య ప్రజలనూ ఆకర్షిస్తున్నాయి.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌

Submitted by arun on Wed, 03/28/2018 - 11:39

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా మమతా బెనర్జీ స్పీడు పెంచారు. హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీలోని పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో దీదీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 

బీజేపీ వ్య‌తిరేక కూట‌మిపై మమతా క‌స‌ర‌త్తు

Submitted by arun on Tue, 03/27/2018 - 14:51

2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఆమె ఢిల్లీలో పలువురు విపక్షనేతల్నీ, విపక్ష ఎంపీలతో వరుస చర్చలు జరుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ, డీఎంకే ఎంపీ కనిమొళితోనూ మమతా బెనర్జీ విడివిడి సమావేశమయ్యారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు గురించి వారితో మంతనాలు జరిపారు. అలాగే  పలువురు విపక్ష ఎంపీలతోనూ మమత చర్చలు జరుపుతున్నారు. 

ఈ చర్చలు ప్రారంభం మాత్రమే

Submitted by arun on Mon, 03/19/2018 - 17:47

ఫెడరల్ ఫ్రంట్‌ నాయకత్వాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రెండు గంటల పాటు ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు కేసీఆర్‌. ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనన్న కేసీఆర్‌...కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరముందని స్పష్టం చేశారు.  ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ తప్ప దేశానికి దేశాన్ని పాలించింది ఎవరని సీఎం అన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన మమతా బెనర్జీ

Submitted by arun on Mon, 03/19/2018 - 15:44

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బెంగాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌ అండ్‌ టీమ్‌కి మమతా సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ, కేసీఆర్‌ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు.

నేడు కోల్‌కతాకు కేసీఆర్‌

Submitted by arun on Mon, 03/19/2018 - 10:32

బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడుతుంటే మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తాను ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌‌ రూపకల్పనకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌‌ ఇవాళ కోల్‌కతా వెళ్లనున్నారు. తృణమూల్‌ అధినేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమై మద్దతు కోరనున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించనున్నారు.