bollywood

RX 100...ఆత్రేయపురం టూ ముంబై

Submitted by arun on Sat, 07/21/2018 - 12:58

టాలీవుడ్‌లో ఈ మధ్య విడుదలైన ఆర్ఎక్స్ 100 చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నానికి పూనుకుంది ఎవరో కాదు. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని వర్మ తన  ట్విటర్ ద్వారా తెలిపాడు.

మరో హీరోయిన్‌తో హార్దిక్ డేటింగ్!

Submitted by arun on Thu, 06/07/2018 - 13:19

మరో క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నదా? తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఓ బాలీవుడ్ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు డీఎన్‌ఏఇండియా అనే వెబ్‌సైట్ ఓ కథనం రాసింది. కొన్నాళ్ల కిందట పాండ్యా.. స్వీడిష్-గ్రీక్ బ్యూటీ ఎల్లి ఎవ్రామ్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి తిరిగిన ఫొటోలూ బయటకు వచ్చాయి.

అతి త్వరలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

Submitted by arun on Tue, 01/02/2018 - 17:59

రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కొత్తకాలంగా చర్చ నడుస్తోంది. కానీ అది ఇన్ని రోజులు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయింది. అయితే అది ఎట్టకేలకు నిజం కాబోతోంది. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే తెలియజేశాడు.అది కూడా సాహో మూవీ తర్వాత.

బాలీవుడ్‌లో మరో మూవీ వివాదం

Submitted by arun on Wed, 12/20/2017 - 15:19

బాలీవుడ్‌లో మరో మూవీ వివాదం రాజుకుంది. ముంబైలోని థియేటర్లలో మరాఠీ సినిమాలనే ప్రదర్శించాలని శివసేన యష్‌రాజ్ ఫిల్మ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రిస్‌మస్‌కు రిలీజ్‌ కానున్న టైగర్ జిందా హై మూవీకి నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. వందల థియేటర్లలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శివసేన మరాఠీ సినిమాలను ప్రదర్శించాలని బాలీవుడ్ నిర్మాతలు దందా నడుపుతామంటే కుదరదని శివసేన నేతలు హెచ్చరిచ్చారు. 

హృతిక్‌.. 'క్రిష్ 4' విల‌న్‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 16:52

హృతిక్ రోష‌న్ సూప‌ర్ హీరోగా న‌టించిన 'క్రిష్‌'కి అభిమానులు కాని వారు ఉండ‌రు. 2006లో వ‌చ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజ‌యం సాధించింది. ఇక 'క్రిష్' కంటే ముందు వ‌చ్చిన 'కోయ్ మిల్ గ‌యా' (2003).. 'క్రిష్' త‌రువాత వ‌చ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజ‌యాలే సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగం రానుంది.

'న్యూట‌న్' క‌లెక్ష‌న్ వివ‌రాలు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 12:59

ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ హిందీ చిత్రం శుక్ర‌వారం వెండితెర‌పైకి వ‌చ్చింది. రిలీజ్ అయిన రోజు క‌లెక్ష‌న్లు వీక్‌గా ఉన్నా.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఆ త‌రువాత మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం రూ.96 ల‌క్ష‌లు, శ‌నివారం రూ.2.52 కోట్లు, ఆదివారం రూ.3.42 కోట్లు, సోమ‌వారం రూ.1.31 కోట్లు రాబ‌ట్టిందీ సినిమా. నాలుగు రోజుల‌కిగానూ.. రూ.8.21 కోట్లు న‌మోద‌యిందన్న‌మాట‌.

'న్యూట‌న్' క‌లెక్ష‌న్ వివ‌రాలు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 12:59

ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ హిందీ చిత్రం శుక్ర‌వారం వెండితెర‌పైకి వ‌చ్చింది. రిలీజ్ అయిన రోజు క‌లెక్ష‌న్లు వీక్‌గా ఉన్నా.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఆ త‌రువాత మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం రూ.96 ల‌క్ష‌లు, శ‌నివారం రూ.2.52 కోట్లు, ఆదివారం రూ.3.42 కోట్లు, సోమ‌వారం రూ.1.31 కోట్లు రాబ‌ట్టిందీ సినిమా. నాలుగు రోజుల‌కిగానూ.. రూ.8.21 కోట్లు న‌మోద‌యిందన్న‌మాట‌.

సాహ‌సం.. సామ‌ర్థ్యం.. మ‌హారావ‌ల్ ర‌త‌న్‌సింగ్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:55

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ హిందీ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెప్టెంబ‌ర్ 20న‌ దీపికా పోషిస్తున్న‌ ప‌ద్మావ‌తి పాత్ర‌ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర బృందం.. ఇవాళ షాహిద్ క‌పూర్ పోషిస్తున్న మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు.

తెర‌పైకి స‌చిన్ కూతురు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 18:36

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గా క్రికెట్ రంగంలో పేరు తెచ్చుకున్నారు స‌చిన్ టెండూల్క‌ర్‌. ఈ ఏడాది ఆయ‌న 'స‌చిన్ - ఎ బిలియ‌న్ డ్రీమ్స్' పేరుతో డాక్యూమెంట‌రీ బ‌యోపిక్ ఫిల్మ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న కుమార్తె సారా టెండూల్క‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది.

'న్యూట‌న్'.. జ‌స్ట్‌ సూప‌ర్‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 13:23

90వ అకాడ‌మీ అవార్డ్స్ (ఆస్కార్‌)కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. ఉత్త‌మ విదేశీ చిత్రం అనే విభాగంలో ఈ సంవ‌త్స‌రానికి గానూ ఆస్కార్‌కి ఎంపికైన 'న్యూట‌న్‌'.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాజ్‌కుమార్ రావ్‌, అంజ‌లి పాటిల్ ('నా బంగారు త‌ల్లి' ఫేమ్‌) , పంక‌జ్ త్రిపాఠి, ర‌ఘ‌బీర్ యాద‌వ్‌, సంజయ్ మిశ్రా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అమిత్ వి.మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మై ప్ర‌శంస‌లు పొందిన ఈ 106 నిమిషాల సినిమా.. 350 భార‌తీయ స్క్రీన్స్‌లో శుక్ర‌వారం విడుద‌లైంది.