International

ఫోక్స్‌వాగన్‌కు 100 కోట్ల జరిమానా!

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:42

జర్మన్ దేశానికి చెందిన కార్లకంపెనీ అయిన ఫోక్స్ వాగన్ ను ఉన్నపలంగా  రూ. 100 కోట్లు సీపీసీబీ వద్ద కట్టాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలు జారిచేసింది. ఫ్రోక్స్ వాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార టెస్ట్ ల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో నేషనల్ ట్రిబ్యునల్ సంస్థ ఉన్నపలంగా ఉత్తర్వులు జారిచేసింది. ఈ పరికరం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలిగిందో  తెలియజేయడాని పర్యవరణశాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటుపరిచారు.

కజ్కిస్తాన్‌లో భారతి విద్యార్థి హత్య - యునివర్శిటి నిర్లక్ష్యం

Submitted by admin on Thu, 11/15/2018 - 16:07

వైద్య విద్యకోసం దేశం కాని దేశం వెళ్లిన ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని కొందరు దుండగులు బలి తీసుకున్నారు.రాజస్తాన్‌కు చెందిన విద్యార్థి హేమంత్‍ వైద్య విద్య కోసం రెండేళ్ల క్రితం వెళ్లాడు.ప్రస్థుతం మూడు సంవత్సరం చదువున్న హేమంత్‌ను కజకిస్తాన్‌కి చెందిన కొందరు హత్య చేశారు.కాగా ఇక్కడి అధికారుల మరియు కజక్ మెడికల్ యునివర్శిటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ఇక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

కువైట్‌లో మూడు రోజులుగా భారీ వర్షం

Submitted by arun on Thu, 11/15/2018 - 12:08

కువైట్‌ దేశాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా బారీ వర్షం కురుస్తుండగా, మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని అక్కడి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇంట్లో నుండి బయటికి రావొద్దని అని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సహయకచర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రక్షణ దళాలను రంగంలోకి దించింది. ఎప్పటికప్పుడు ప్రమాద పరిస్థితులు తెలుసుకోనేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంబంధించిన వెంటనే  టోల్ ప్రీం నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది.  

24గంటల్లో 149మంది చనిపోయారు

Submitted by chandram on Mon, 11/12/2018 - 14:32

యెమెన్‌లోని హోదైడా నగరంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై చెలరేగిపొయారు. ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రపాణానష్టం వాటిల్లింది. దాదాపు 24గంటలు జరిగిన హోరాహోరా కాల్పుల్లో 149 మంది చనిపోయారని డాక్టర్లు, మిలిటరీ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే హోదైడా వ్యాప్తంగా 110 మంది తిరుగుబాటుదారులు,32 మంది ప్రభుత్వవర్గీయులు చనిపోయారని వైద్యులు వెల్లడించారు.తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న హొదైడా నగరాన్ని ఎలగైనా చేజిక్కించుకోవాలని ప్రభుత్వ బలగాలు ఈ హింసాత్మకతకు దిగాయి.

ర్యాటిల్ స్నేక్, తాబేలు స్నేహం..

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 08:10

సాధారంణగా అడవిలో ఉండే క్రూర మృగాలు ఇతర జంతువులు కనిపిస్తే వేటాడడం చూశాం. కానీ అవే జంతువులు స్నేహంగా ఉండడం అరుదుగా చూస్తుంటాం. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఇక్కడ ఓ భయంకరమైన ర్యాటిల్ స్నేక్ తాబేలు వీపుపై ఎక్కి ప్రయాణం చేస్తోంది. అయితే పాము, తాబేలుకు పెద్దగా శత్రుత్వం లేదు కనుక తాబేలు బ్రతికిపోయింది. అత్యంత నిదానంగా నడిచే సరీసృపాల్లో తాబేలు కూడా ఒకటి.. అలాంటిది దానిమీద పాము ఎక్కి కూర్చుంటే మరింత నిదానంగా నడుస్తుందా తాబేలు. గతేడాది వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు తమదైన వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు.

కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..జవాన్ మృతి

Submitted by chandram on Sat, 11/10/2018 - 13:47

కాల్పుల ఒప్పందానికి మరో సారి పాక్ తూట్లు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రత్యేర్థే టార్గెట్ గా పాక్ సైన్యం విరుచుకపడుతుంది. నేటి ఉదయం సుందర్ బానీ సెక్టార్ లో పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను తీవ్రగాయాలతో కోన ఉపిరితో కొట్టు మిట్టడుతూ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే సమయంగా పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది.   
 

కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 9 మంది బలి

Submitted by chandram on Sat, 11/10/2018 - 11:58

ఉత్తర కాలిఫోర్నియాలో  అడవి ప్రాంత్రాన్ని కార్చిచ్చు మింగెస్తుంది. ఇప్పటివరకు మంటల ధాటితో తొమ్మండుగురి ప్రాణాలు అగ్నికి బలైపోయారు. 6700 నివాసాలు బుగ్గిపాలయ్యాయని  కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ వెల్లడించింది. మరో 35 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. ప్యారడైజ్ పట్టణానికి దగ్గరలో మంటలు అంటుకున్న ఒక్కరోజులోనే సుమారు 362 చదరపు కిలోమీటర్ల వరకు దావాగ్ని వ్యాప్తించింది. మంటలను అదుపుచేసే పరిస్ధితితే లేదు. మెళ్లీగా మంటలు మాలిబూ నగరానికి విస్తరించడంతో అక్కడి అధికారులు జాగ్రత్త పడ్డారు. కాగా ఇప్పటివరకు 2.5 లక్షల మంది వేరే ప్రాంత్రాలకు సురక్షంగా పంపించారు.

టీ 20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా

Submitted by chandram on Sat, 11/10/2018 - 10:12

మహిళల టీ 20 ప్రపంచ కప్‌లో భారత అమ్మాయిలు బోణీ కొట్టారు. గయానా‌లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో టీమిండియా 34 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులను సాధించింది. భారత బ్యాట్స్‌వుమెన్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 103, రోడ్రిగ్స్‌ 59 పరుగులు చేశారు. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలింది. భారత బౌలర్లలో హేమలత 3, పూనమ్‌ యాదవ్‌ 3, రాధా యాదవ్‌2, అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు.

అమెరికాలో మరోసారి కాల్పులు.. 13 మంది మృతి

Submitted by nanireddy on Fri, 11/09/2018 - 07:58

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. దుండుగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణంలో ఉన్న బార్డర్‌లైన్‌ బార్‌లో జరిగింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణానికి చెందిన ఓ కళాశాల చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ కళాశాలకు పక్కనే ఉన్న బార్‌లో నుంచిపేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...

Submitted by arun on Thu, 11/08/2018 - 17:31

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి గురువారం తెల్లవారుజామున చొరబడిన ఓ వ్యక్తి అక్కడున్న వారిపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గన్‌మెన్‌తో సహా 13మంది మృతి  చెందగా గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు హుటా హుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాలేజీ విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన సంభవించింది. బార్‌లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.