National

మరో ఘోర బస్సు ప్రమాదం : 13మంది మృతి

Submitted by arun on Fri, 09/14/2018 - 14:04

జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా  మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

దూకుడు పెంచిన బీజేపీ...తెలంగాణకు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 13:06

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 

బతికున్న పామును మింగి.. 4 గంటల్లోనే

Submitted by arun on Fri, 09/14/2018 - 10:53

ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఆకతాయిలు రెచ్చగొట్టడంతో ఓ పాము పిల్లను అమాంతం మింగేశాడు. 4 గంటల్లో ఒళ్లంతా విషం వ్యాపించి అతను చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) బుధవారం ఫుల్లుగా తాగి ఇంటికి వస్తుండగా అతనికి రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది. దాన్ని తీసుకొని సరదాగా ఆడుకుంటుండగా కొందరు ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సింగ్‌ పాముపిల్లను తన పిడికిలిలో పట్టుకుని, రోడ్డుపై వేసి, తలమీద పెట్టుకుంటూ ఆటలాడసాగాడు. ఇంతలోనే ఓ ఆకతాయి పామును నోట్లో పెట్టుకుంటావా?

కార్పొరేటర్‌ ఘాతుకం...బ్యూటీ సెలూన్‌లో మహిళను...

Submitted by arun on Thu, 09/13/2018 - 16:39

తమిళనాడులోని పెరంబళూరులో దారుణం జరిగింది. డీఎంకే కు చెందిన కార్పొరేటర్‌ సెల్వకుమార్‌ దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌ లోకి చొరబడి ఓ మహిళను విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. మహిళ కడుపుపై కనికరం లేకుండా పదే పదే కాలితో తన్నాడు. అక్కడే ఉన్న మిగతా మహిళలు కొట్టవద్దని బతిమాలిన పట్టించుకోలేదు. ఈ ఏడాది మే 25 న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విజువల్స్ ను బ్యూటీ పార్లర్‌ యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

రూ.5 కోట్లిస్తా.. రేప్‌ చేశానని చెప్పొద్దు...కలకలం రేపుతున్న...

Submitted by arun on Thu, 09/13/2018 - 14:57

కేరళలో నన్ రేప్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రైస్తవ సన్యాసినిని బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ అత్యాచారం చేసిన వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నన్‌ల ఆందోళనతో కేసు విచారణ వేగంవంతం అయ్యింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలంటూ బిషప్ఫ్రాంకో ములక్కల్‌కు పోలీసులు సమన్లు పంపారు. మరోవైపు బాధిత నన్ వాటికన్‌ కు లేఖ రాయడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. 

విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు...ఇంగ్లండ్ వెళ్లే ముందు అరుణ్ జైట్లీని...

Submitted by arun on Thu, 09/13/2018 - 11:54

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని చెప్పారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడుతూ మాల్యా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ రావడానికి ముందు ఆర్థిక మంత్రి జైట్లీని చాలాసార్లు కలిశానని, బ్యాంకు రుణాల చెల్లింపుకు సంబంధించిన అనేక ఆఫర్లు ఇచ్చానని తెలిపారు. అయితే మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆ వివరాలను తాను ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు.

లైవ్‌లో మాట్లాడుతూ కన్నుమూత

Submitted by arun on Tue, 09/11/2018 - 10:27

మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. మనతో మాట్లాడుతున్న మనుషులు ఇంకాసేపటి ఏం అవుతారో చెప్పేలేం. టీవీ షో లైవ్ షోలో మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త, రచయిత ప్రొఫెసర్  రీటా జతీందర్(86) కుప్పకూలిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాకముందే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ విషాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దూరదర్శన్‌ రీజినల్ ఛానల్‌లో ‘గుడ్‌ మార్నింగ్‌ జమ్మూకశ్మీర్‌’ అనే పాపులర్‌ లైవ్‌ షో నడుస్తోంది. హోస్ట్ జాహిద్ ముఖ్తర్. గెస్ట్ సీట్లో 86 ఏళ్ల రీటా జతిందర్‌. తన జీవిత గమనం గురించి, సాధించిన విజయాల గురించిన ప్రశ్నలకు జవాబులిస్తోంది.

కాంగ్రెస్ వినూత్న నిరసన...దెయ్యాల గెటప్‌లు వేసి....

Submitted by arun on Mon, 09/10/2018 - 14:18

పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇవాళ భారత్‌ బంద్‌ జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్‌కు టీడీపీ, ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. భారత్‌ బంద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఛత్తీస్ ఘడ్ లోని రాయిపూర్ లో కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపింది. ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు దెయ్యాల గెటప్ లలో జనాలను కొరుక్కు తింటున్నట్లు నటించారు. అధిక ధరలతో మోడీ ప్రభుత్వం సామాన్యుల బతుకులను నాశనం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన...

Submitted by arun on Mon, 09/10/2018 - 12:50

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆదివారం రాత్రి ఆయన ముచ్చటించారు. గత రెండేళ్లుగా ఈ ఫీల్డ్‌ను వదిలివేయాలని ఉందని చెప్పిన ప్రశాంత్ కిషోర్... తాను ప్రారంభించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)సంస్థ బాధ్యతలను సమర్ధత ఉన్న వ్యక్తికి అప్పజెప్పాలని చూస్తున్నట్లు వివరించారు. గత ఆరేళ్లుగా తాను అనేక మంది ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశానని ఇకపై తాను తొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్‌కు కాని వెళతానని ప్రశాంత్ తెలిపారు.

దేశవ్యాప్తంగా భారత్ బంద్...పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా విపక్షాల ఆందోళన..

Submitted by arun on Mon, 09/10/2018 - 09:14

పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇవాళ భారత్‌ బంద్‌ జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్‌కు టీడీపీ, ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. భారత్‌ బంద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.